Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే 20వ తేదీన 40వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తారక్ కిశుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా మే 20 వతేదీ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు భారీగా ట్రెండ్ అయిందని చెప్పాలి.
ఇలా తన పట్ల అభిమానులు చూపిస్తున్నటువంటి ప్రేమకు ఎన్టీఆర్ ఫిదా అయ్యారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులందరికీ ఈయన థాంక్యూ నోట్ ను విడుదల చేశారు.కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తున్నాను ఇలా కెరియర్లో ఎత్తు పల్లాలను చూసిన ప్రతిసారి అభిమానులే నన్ను ముందుకు నడిపిస్తున్నారు. పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు నేను నటించే ప్రతి పాత్ర ప్రతి కథ కూడా అభిమానుల కోసమేనని ఈయన తెలియజేశారు.
Ntr: దేవర పోస్టర్ కు అనూహ్యమైన స్పందన…
ఇలా నాపై ప్రేమను చూపిస్తున్న ప్రతి ఒక్కఅభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తారక్ ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఈ నోట్ విడుదల చేశారు. అలాగే దేవర పోస్టర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనకు చాలా గర్వపడుతున్నాను. నా పుట్టినరోజు వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చిన నా కుటుంబ సభ్యులకు సన్నిహితులకు అభిమానులకు శ్రేయోభిలాషులకు,సినీ ప్రేమికులకు ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ థాంక్యూ నోట్ ద్వారా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.