NTR: కే జి ఎఫ్ సినిమా ద్వారా డైరెక్టర్ గా మారి పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతే కాకుండా ఇటీవల కేజీఎఫ్ 2 చిత్రంతో మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఇలా కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందిన ప్రశాంత నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని రూపొందిస్తున్నాడు.
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా జూన్ 4న నీల్ పుట్టిన రోజు సందర్భంగా సలార్ సెట్ లో బర్త్ డే సెలబ్రెషన్స్ ప్రభాస్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా నీల్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా నీల్ కి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
NTR: నాటుకోడి పులుసు…
ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రశాంత్ నీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా ద్వారా నీల్ కి బర్త్డే విషెస్ తెలియజేశాడు. అంతేకాకుండా నీల్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ అతనికి ఒక సర్ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కు బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ అతనికి నాటు కోడి పులుసును పంపించారు. ఈ విషయాన్ని నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.