Ntr: తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి క్రేజ్ మనకు తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి వారసత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. అయితే తాజాగా నందమూరి యువ హీరోలు అందరూ ఒకే ప్రేమ్ లో కనిపించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తాజాగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కుమారుడు వివాహం ఆదివారం గచ్చబౌలిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇలా హరికృష్ణ కుమార్తె కుమారుడు అనగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లకు మేనల్లుడు కావడంతో ఈ పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఈ విధంగా మేనల్లుడు పెళ్లి వేడుకలలో భాగంగా కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ పాల్గొని సందడి చేయడమే కాకుండా ఈ పెళ్లి వేడుకలలో భాగంగా బాలకృష్ణ అలాగే మోక్షజ్ఞ కూడా సందడి చేయడం విశేషం ఇలా నందమూరి హీరోలందరూ ఒకే చోట చేరడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ఇదివరకు ఎప్పుడూ కూడా తన అన్నయ్యలు కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ వద్ద కలిసి కనిపించిన సందర్భాలు లేవు అయితే తాజాగా వీరితో కలిసి మోక్షజ్ఞ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Ntr: ఒకే ప్రేమ్ లో నందమూరి హీరోలు…
ముఖ్యంగా ఎన్టీఆర్ మోక్షజ్ఞ ఇద్దరు కూడా ఒకే ప్రేమ్ లో కనిపించడంతో వీరిద్దరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. గత కొంతకాలంగా బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్య కూడా పలు సందర్భాలలో ఎన్టీఆర్ కలిసినప్పటికీ ఆయన పలకరించకుండా ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకున్నారు. అయితే ఇలా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి సుహాసిని కుమారుడి పెళ్లి వేడుకలలో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ముగ్గురు హీరోలను ఒకే ప్రేమ్ లో చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటూ అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.