NTR:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హీరో హీరోయిన్లు మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు రావడం సర్వసాధారణం.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సమయంలో ఒక హీరోయిన్ తో ఈయన ప్రేమలో పడ్డారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై గతంలో ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన అశోక్ నరసింహ వంటి చిత్రాలలో ఈయన సరసన నటి సమీరా రెడ్డి నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ రెండు సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి.
NTR: సమీరా రెడ్డి పై మనసు పడ్డ తారక్…
ఇలా తన గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఎన్టీఆర్ సైతం ఆ హీరోయిన్ పై కాస్త ఇంట్రెస్ట్ చూపించారని వెల్లడించారు. అయితే తన వయసు అప్పుడు కేవలం 23 సంవత్సరాలేననీ అది కేవలం అట్రాక్షన్ మాత్రమే అంటూ ఎన్టీఆర్ కామెంట్ చేశారు. ఇలా ఎన్టీఆర్ సమీరా రెడ్డి పై ఇంట్రెస్ట్ చూపించాను అంటూ కామెంట్ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ రెండు సినిమాల తర్వాత తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. ఇక సమీరా రెడ్డి కూడా పెద్దగా తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయలేదని చెప్పాలి.