NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి ఆదరణ అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఎన్టీఆర్ గతంలో తన తనకు కాబోయే భార్య గురించి చేసినటువంటి కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి.
తనకు భార్యగా రాబోయే అమ్మాయి విషయంలో ఈ క్వాలిటీ తప్పనిసరిగా ఉండాలని ఎన్టీఆర్ అప్పట్లోనే తనకు కాబోయే భార్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తన అమ్మ అంటే చాలా ఇష్టమని,అమ్మ విషయంలో తాను ఎక్కడికి వరకు వెళ్లడానికైనా సిద్ధమేనని తెలిపారు. అలాంటి అమ్మను మంచిగా చూసుకునే లక్షణం ఉన్నటువంటి అమ్మాయి తనకు భార్యగా రావాలని ఎన్టీఆర్ కోరుకున్నారట అయితే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కోరికకు అనుగుణంగానే ఉన్నారని తెలుస్తోంది.
NTR: తల్లిలా చూసుకుంటున్న ప్రణతి…
ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం బిజీగా ఉండగా లక్ష్మీ ప్రణతి తన అత్తయ్య ఎంతో మంచిగా ఉంటారని తెలిపారు. ఇక లక్ష్మీ ప్రణతి తనని అత్తయ్యలా కాకుండా ఒక అమ్మలా చూసుకుంటున్నారని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ కోరుకున్న విధంగానే లక్ష్మీ ప్రణతి ఒక మంచి కోడలిగా భార్యగా ఒక తల్లిగా పేరు సంపాదించుకున్నారని చెప్పాలి.ఇక లక్ష్మీ ప్రణతి ఇతర హీరోల భార్యల మాదిరిగా పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు ఈమె ఏదైనా ఫంక్షన్ల నిమిత్తం బయటకు వచ్చిన లేదా వెకేషన్ లకు వెళ్లిన ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటాయి.