Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో మంచిసక్సెస్ అందుకున్నారు ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొంది వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కెరియర్ గురించి పక్కన పెడితే ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇక వీరి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం.ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ పొందినటువంటి ఈయన వ్యక్తిగత జీవితంలో ఒక భర్తగా ఒక తండ్రిగా కూడా గొప్పగా పేరు సంపాదించుకున్నారు. ఇక లక్ష్మీ ప్రణతి కేవలం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇంటికి పరిమితమయ్యారు. ఇక ఈమె సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కి తన భార్య లక్ష్మీ ప్రణతి అంటే ఎంతో అమితమైన ప్రేమ. తన భార్యపై ఉన్నటువంటి ప్రేమను ఎన్టీఆర్ పలు సందర్భాలలో బయటపెడుతూ ఉంటారు. ఇప్పటికే తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా 6 ఎకరాల ఫామ్ హౌస్ తనకు కానుకగా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

Ntr: ప్రణతి అంటే అంత ప్రేమనా…
ఇక ఈ ఫామ్ హౌస్ కి బృందావనం అనే పేరు కూడా పెట్టారు. ఇలా తన భర్త తన పుట్టినరోజుకు ఇచ్చినటువంటి ఈ కానుక చూసి లక్ష్మీ ప్రణతి ఎంతో సంతోషపడ్డారు. అయితే తాజాగా ఈమెకు మరొకసారి ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది. ఆడవాళ్లకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఏకంగా తన భార్యకు వంద తులాల బంగారం కొనుగోలు చేసి తనకు సర్ప్రైజ్ ఇచ్చారని తెలుస్తుంది.ఇలా ఎన్టీఆర్ తన భార్య పట్ల చూపిస్తున్నటువంటి ఈ ప్రేమ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు.