NTR: నందమూరి తారక రామారావు మే 28వ తేదీ శత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు, నందమూరి అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు పలు ప్రాంతాలలో ఇప్పటికే ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ జయంతి వేడుకలకు ఎంతోమంది సినీ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇక ఈ వేడుకలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారికి కూడా ఆహ్వానం అందినప్పటికీ నందమూరి హీరోలు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు.
ఇక ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం తన పుట్టినరోజు కూడా అదే రోజు కావడంతో రాలేకపోతున్నానని వెల్లడించారు కానీ నిజానికి వేరే కారణం ఉందని తెలుస్తోంది.ఎన్టీఆర్ తన తాతయ్య వేడుకల కన్నా తన పుట్టినరోజు ఎక్కువ కాదు ఆయన రావాలి అనుకుంటే తప్పకుండా వచ్చేవారు కానీ ఎన్టీఆర్ ఈ వేడుకలకు రాకపోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు ఆహ్వానం పంపించిన ఈ వేడుకకు రావడం నందమూరి ఫ్యామిలీకి చెందిన మరో వ్యక్తికి ఇష్టం లేదని వార్త వారి వరకు చేరింది.
NTR: ఎన్టీఆర్ రావడం బాలకృష్ణకు ఇష్టం లేదా…
ఇలా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరవడం వల్ల మరొక వ్యక్తి బాధపడతారు అన్న వార్త తెలియడంతో వారిని బాధ పెట్టడం ఇష్టం లేక ఎన్టీఆర్ కల్యాణ్ రామ్ ఇద్దరూ కూడా ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తుంది. అయితే ఈ వార్త వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రావడం బాలకృష్ణకు ఇష్టం లేదని అందుకే ఎన్టీఆర్ తన బాబాయిని కష్టపెట్టకుండా ఉండడం కోసమే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారంటూ భావిస్తున్నారు.అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య ఈ విభేదాలు కొనసాగుతూనే ఉన్న విషయం మనకు తెలిసిందే.