Ntr Uma Maheshwari: తెలుగు సినీ ఇండస్ట్రీకి నందమూరి కుటుంబం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబం కు సినిమాల పరంగా, రాజకీయల పరంగా మంచి గౌరవం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా వీరి కుటుంబంలో ఒక విషాదం నెలకుంది. సీనియర్ ఎన్టీఆర్ నాలుగవ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి ఈరోజు హఠాత్మరణం చెందారు.
జూబ్లీహిల్స్ లో తన ఇంట్లో ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు ఉమామహేశ్వరి. దీంతో ఈమె మరణ వార్త తెలిసిన వెంటనే ఎన్టీఆర్ కుటుంబం సభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇక చంద్రబాబు కూడా బయలు దేరినట్లు సమాచారం అందింది. విదేశాలలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారం అందించారు.
అయితే ఆమె మరణానికి కారణం ఏంటో తెలియకపోగా ప్రస్తుతం ఈ విషయం గురించి తెలియటంతో అందరూ ఆమె మృతి పై సంతాపం తెలుపుతున్నారు. ఉమామహేశ్వరి మొదట నరేంద్రం రాజన్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. అతడు ఆమెను తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో అతడి నుండి విడిపోయారు. ఆ తర్వాత కంటమనేని శ్రీనివాస్ ప్రసాద్ తో వివాహం చేసుకున్నారు.
ఇక ఉమామహేశ్వరి.. సీనియర్ ఎన్టీఆర్- బసవతారకం ల నాలుగవ కూతురు. ఎన్టీఆర్ కు మొత్తం 11 మంది సంతానం. అందులో జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ, లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నార భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి.
Ntr Uma Maheshwari: ఆమె మరణంతో జీర్ణించుకోలేకపోతున్న కుటుంబ సభ్యులు..
ఇక తాజాగా ఉమామహేశ్వరి మరణించడంతో తన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పైగా ఉమామహేశ్వరి గత కొంత కాలం నుండి అనారోగ్య సమస్యతో బాధపడగా ఆ మధ్యనే తన చిన్న కూతురుకి వివాహం చేశారు. ప్రస్తుతం ఆమె మరణానికి గల కారణాలు తెలియక పోగా.. ప్రస్తుతం ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నట్లు తెలుస్తుంది.