NTR: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్న వారందరూ వారు ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో ఖరీదైనది సౌకర్యవంతంగా ఉన్నది మాత్రమే కొనుగోలు చేస్తారు. అయితే ఇలా ఖరీదైన వస్తువులను ఉపయోగించడంలో ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అని చెప్పాలి. ఎన్టీఆర్ కి లగ్జరీ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు. అందుకే ఈయన తరచూ ఖరీదైన వాచీలు, కార్లు టీషర్ట్లు కొనుగోలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ ద్వారా వార్తల్లో నిలవగా తాజాగా ఈయన టీషర్ట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్ తాజాగా తన అన్న కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం శిల్పారామంలో ఎంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఇకపోతే ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ బ్లాక్ టీ షర్ట్ ధరించి రావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి Karl Lagerfeld అనే బ్రాండ్ కు సంబంధించిన టీషర్ట్ ధరించి వచ్చారు. ఇక ఈ టి షర్ట్ అభిమానులను ఆకర్షించడంతో అభిమానులు వెంటనే ఈ టీ షర్ట్ ఖరీదు ఎంత ఉంటుందని ఆన్లైన్ సెర్చ్ చేశారు.
NTR: టీ షర్ట్ ధర 24 వేల రూపాయలా….
ఈ విధంగా ఈ టీషర్ట్ ఖరీదు ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించిన అభిమానులు ఒక్కసారిగా ఈ టీ షర్ట్ ఖరీదు తెలిసి కంగుతిన్నారు. ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ధరించిన ఈ టీ షర్ట్ అక్షరాల 24 వేల రూపాయలు అని చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి ఈ టీ షర్ట్ ధర 24 వేల రూపాయల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ధరించిన ఈ టీ షర్ట్ ఖరీదుతో ఒక మధ్యతరగతి కుటుంబీకులు 3 నెలల పాటు సంతోషంగా గడపవచ్చని భావిస్తున్నారు.ఇక ఈ టి షర్ట్ నచ్చి కొనాలని అభిమానులు భావించినప్పటికీ దీని ధర చూస్తే మాత్రం కొనలేమని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి కాస్ట్లీ వస్తువులను ఉపయోగించడంలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు