Junior Ntr: తెలుగు సినీ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నందమూరి తారక రామారావు వారసుడిగా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తనకు ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇటీవలే విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారాడు. ఇకపోతే తారక్ క్యారెక్టర్ గురించి మనందరికీ తెలిసిందే.
అనవసరంగా ఏ విషయాలలోకి తల దూర్చడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇంతగా యాక్టివ్ గా కనిపించడు. ఒక్క సినిమాల విషయంలో మాత్రమే తారక్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎవరి జోలికి ఫోన్ ఎందుకు తన జోలికి వస్తే మాత్రం వదలడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ లో అభిమానులకు నచ్చే క్వాలిటీ ఏదున్నా కూడా ముఖం మీద చెప్పేస్తూ ఉంటాడు. అవతలి వ్యక్తి ఏమనుకుంటారో అనుకోకుండా ఏదైనా ఉన్నా కూడా మనసులో దాచుకోకుండా బయటకు చెప్పేస్తూ ఉంటాడు.
అలాగే ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ లు కూడా బాగా వాల్యూ ఇస్తారు. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ ఉంటాడు. అయితే అటువంటి ఫ్రెండ్షిప్ ని అడ్డం పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ ని మోసం చేశారు ఒక ఫ్రెండ్. మీరు విన్నది నిజమే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ నమ్మి వారిలో ఒకరు నీ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తి ఎన్టీఆర్ ని దారుణంగా మోసం చేశాడు. ఎన్టీఆర్ కి రియల్ స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్ తో పాటు కొనసాగుతూ వచ్చిన అతను సింహాద్రి సినిమా హిట్ తరవాత తారక్ రేంజ్ మారిపోవడంతో, సదరు హీరో తన అవసరాల కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఎన్టీఆర్ పేరు వాడుకొని కొందరి దగ్గర డబ్బులు తీసుకుని వాడుకున్నాడట.
Junior Ntr: ఆ కారణంతో ఫ్రెండ్ ని దూరం పెట్టిన ఎన్టీఆర్..
ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి కూడా చెప్పలేదట. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఆంద్రావాలా,సాంబ,నా అల్లుడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫైనాన్సియల్ గా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ ఫ్రెండ్ కి అప్పులు ఇచ్చిన జనాలు మొత్తం ఎన్టీఆర్ పై పడి మీ ఫ్రెండ్ నీ పేరు చెప్పుకుని మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు మీ మార్కెట్ పడిపోయింది మీ మీద నాకు నమ్మకం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వు అంటూ పీకల మీద కూర్చున్నారట. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గర దాచుకొని డబ్బులు మొత్తం వారికి ఇచ్చేశాడట. ఆ తర్వాత తన ఫ్రెండ్ వచ్చి సారీ చెప్పగా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అతన్ని క్షమించకుండా నీ అవసరాలకు నా పేరును వాడుకొని నా పరువు తీయాలని చూసావు..ఇక జన్మలో నేను నిన్ను నమ్మను అంటూ దూరం పెట్టేసాడట. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అతనికి దూరంగానే ఉన్నాడట.