NTR Wife: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త నార్ని శ్రీనివాస్ రావు కుమార్తెను 2011వ సంవత్సరంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.ఇలా వైవాహిక జీవితంలో ఎన్టీఆర్ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. తన భార్య పిల్లలతో ఈయన సంతోషంగా ఉన్నారని చెప్పాలి. ఇక వీరి వివాహం జరిగి దాదాపు 12 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలకు చోటు లేకుండా సంతోషంగా ముందుకు కొనసాగుతున్నారు.
ఈ విధంగా వీరిద్దరూ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి. ఇక ప్రణతి సినిమా ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా తన వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.ఇదిలా ఉండడం ప్రణతికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రణతి పెళ్లి కోసం కట్టుకున్నటువంటి చీర గురించి ఓ వార్త సంచలనంగా మారింది. పెళ్లిలో లక్ష్మీ ప్రణతి కట్టిన చీర ధర ఏకంగా కోటి రూపాయలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
NTR Wife: బంగారు పోగులతో డిజైన్ చేసిన చీర…
పెళ్లి కోసం లక్ష్మీప్రతి ప్రత్యేకంగా చీరను డిజైన్ చేయించుకున్నారట. ఈ చీర కోసం ఏకంగా బంగారం వెండి పోగులను ఉపయోగించి ఈ చీరను తయారు చేశారని తెలుస్తుంది. ఇలా ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేయించడం కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇక ఈ చీరకు అనుగుణంగా లక్ష్మీ ప్రణతి డైమండ్ జువెలరీ ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఇలా సాంప్రదాయ బద్ధంగా లక్ష్మీ ప్రణతి పెళ్లి కోసం ధరించిన ఈ చీర ఖరీదు తెలిసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.ఇక ఎన్టీఆర్ పెళ్లి కోసం అప్పట్లోనే దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.