NTR Wife: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగుకు నోచుకోలేదు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించి శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇలా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండగా ఆయన భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు.ఇక సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉండే ప్రణతి ఏదైనా వెకేషన్ లోకి వెళ్ళినప్పుడు లేదా స్పెషల్ డే కి సంబంధించిన ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి.ఇక తాజాగా మార్చి 26వ తేదీ లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ క్రమంలోనే అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో ఈమె పుట్టినరోజు జరుపుకున్నారు.
NTR Wife: లక్షలు విలువ చేసే హ్యాండ్ బ్యాగ్…
ఇలా ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో లక్ష్మీ ప్రణతి ధరించిన హ్యాండ్ బ్యాగ్ ఆమె డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించాయి.ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రణతి ధరించిన ఈ హ్యాండ్ బ్యాగ్ డ్రెస్ ఖరీదు ఎంత అంటూ పెద్ద ఎత్తున వీటి ధర గురించి ఆరా తీస్తున్నారు. ఇక పుట్టినరోజున లక్ష్మీ ప్రణతి ధరించిన హ్యాండ్ బ్యాగ్ లూయిస్ విట్టన్ – పెటిట్ మల్లె: దీని ధర ఏకంగా – రూ. 3,28,154 లక్షలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆమె ధరించిన డ్రెస్.. అనుశ్రీ రెడ్డి – ఫ్లోరియన్ బ్రౌన్ ఫ్రంట్ నాటెడ్ కాఫ్తాన్ దీని ధర 43,900 రూపాయలు అని తెలియడంతో నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.