NTR Wife: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా లో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావటంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మీడియా ముందు తక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే తాజాగా లక్ష్మి ప్రణతికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేస్తూ ‘వదినమ్మ’ అంటూ క్యాప్షన్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. మొదటిసారిగా లక్ష్మి ప్రణతి ఇలా ప్రజల మధ్యకి రావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. మీడియా ముందు ఎక్కువగా కనిపించని లక్ష్మీ ప్రణతి తాజాగా హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో జరుగుతున్న నైట్ బజార్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రణతి చార్మినార్ వద్ద షాపింగ్ కూడా చేశారు. అయితే కుటుంబసభ్యులు ఎవరు తోడు లేకుండా ప్రణతి ఒక్కరే చాలా సింపుల్ గా వచ్చి షాపింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
NTR Wifeనైట్ బజార్ లో షాపింగ్ చేసిన ప్రణతి…
ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమె ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో భార్య అయ్యిండి ఇలా చాలా సింపుల్ గా జనాల మధ్య షాపింగ్ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక సెలబ్రిటీ అయ్యుండి ఇలా జనాల మధ్యన షాపింగ్ చేస్తున్న ఆమె సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. అయితే సినిమా ఈవెంట్లలో, ఫంక్షన్లలోనూ పెద్దగా కనిపించని ప్రణీత ఇలా చార్మినార్ వద్ద సందడి చేయటంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.