Nusrat Jahan పశ్చిమబెంగాల్ కు చెందిన యువ హీరోయిన్ నస్రత్ జహాన్ గతంలో పలు సీరియల్లు మరియు చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుతం నస్రత్ జహాన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తోంది.
అయితే ఈ మధ్య కాలంలో నటి నస్రత్ జహాన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. కాగా తాజాగా నస్రత్ జహాన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలతో సోషల్ మీడియా మాధ్యమాలలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఆ ఫోటోలలో ఏముందంటే నస్రత్ జహాన్ కొంతమేర బికిని దుస్తులు ధరించి క్లీవేజ్ షో చేస్తూ బోల్డ్ గా ఫోటోలకి ఫోజులిచ్చింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు అలాగే బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉండి ఇలా బోల్డ్ గా ఫోటోలకు ఫోజులివ్వడం అంతటితోఆగకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరి కొందరు మాత్రం పొలిటిషన్స్ కి కూడా సొంత లైఫ్ ఉంటుందని కాబట్టి వారికి నచ్చినట్లు ఎంజాయ్ చేసే హక్కు కూడా ఉంటుందని ఇందులో భాగంగా తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత ఘాటుగా అందాల ఆరబోస్తే ఎవరైనా ఫిదా అవుతారని అలాగే నెక్స్ట్ ఎలెక్షన్స్ లో మా ఓట్లు మీకే వేస్తామంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.
ఐతే ట్రెండ్ మారుతున్న కొద్దీ సినీ సెలబ్రిటీల ఆలోచనా తీరు కూడా బాగానే మారుతోంది. ఈ క్రమంలో కొందరు సినీ సెలబ్రిటీలు ఒకపక్కన సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వ్యాపారాలు, రాజకీయాలు అంటూ బాగానే రాణిస్తున్నారు. కాగా ఇందులో ఇప్పటికే ప్రముఖ నటులైన స్వర్గీయ నటుడు ఎంజీఆర్, అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విశాల్, శతృఘ్న సిన్హా మరియు మరింత మంది సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా అలాగే రాజకీయాల్లో కూడా తమదైన శైలిలో రాణించి చెరిగిపోని ముద్ర వేశారు. దీంతో నేటితరం యువ నటీనటులు కూడా రాజకీయాల వైపు బాగానే మొగ్గు చూపుతున్నారు.