Nuvuu Nenu Prema November 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అరవింద వాళ్ళు రావడంతో అందరూ సంతోష పడుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పద్మావతి ఫ్యామిలీ మురళి వైపు కోపంగా చూస్తూ ఉండగా వీళ్ళకు నేనంటే మర్యాద లేకుండా పోయింది. ఎలా అయినా వీళ్లను భయపెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు మురళి. అప్పుడు అందరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా కుచల మాత్రం సీరియస్ అవుతూ ఇలా బయట నిలిచోబెట్టే మాట్లాడతారా ఇంట్లోకి పిలవరా అని అంటుంది. తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్లడంతో పద్మావతి విక్కీ కూడా చివరగా వెళ్తూ ఉంటారు. అప్పుడు పద్మావతి పడబోతుండగా విక్కీ పట్టుకోవడంతో ఇద్దరు ఒకరి కళ్ల లోకి ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు.

పద్మావతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న మురళి

అది చూసి మురళి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు ఏది చూసుకోవా అనడంతో నన్ను చూసుకోవడానికి మీరు ఉన్నారు కదా సారు అని పద్మావతి లోపలికి వెళ్తుండగా పద్మావతిని చిటికెలు వేసి ఆపుతాడు మురళి. ఏంటి పద్మావతి వికీ నేను భార్యగా యాక్సెప్ట్ చేశాడని పగటి కలలు కంటున్నావా అనడంతో నేను కూడా నీకు అదే చెప్తున్నాను అన్నయ్య మా ఇద్దరిని విడగొట్టాలని నువ్వు పగటి కలలు కనద్దు అనడంతో కలలు కనడం కాదు అవి నిజం చేసి చూపిస్తాను అని అంటాడు మురళి. అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ అనడంతో ఎందుకు అనగా త్వరలోనే మీరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు కదా అని అంటాడు మురళి. ఇంకొకసారి ఆ కూత కూస్తే మర్యాదగా ఉండదు అని అంటుంది. నువ్వు ఎంత అరిచినా లాభం లేదు.

మురళి కాలర్ పట్టుకున్న భక్త

నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేసేలోపు మీరు పెట్టుకున్న గడువు ముగిసిపోతుంది అని అంటాడు మురళి. మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా పద్మావతి ఇక్కడ తగ్గేది లేదు అని కోపంగా మాట్లాడుతుంది పద్మావతి. నువ్వు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా కూడా నేను తిప్పి కొడతాను అని అంటుంది. విక్కీ సంగతి సరే మరి మీ వాళ్ళ పరిస్థితి ఏంటి. నిజం తెలిస్తే మీ నాన్న ఏమవుతాడు అసలే ఆయన హార్ట్ పేషెంట్ అనడంతో పద్మావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత పార్వతి, భక్త వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా మురళి అక్కడికి వచ్చి అత్తయ్య మామయ్య పిన్ని బాగున్నారా అనడంతో మురళి కాలర్ పట్టుకొని ఎవర్రా నీకు మావయ్య ఇంకొకసారి అలా పిలిస్తే మర్యాదగా ఉండదు అని అంటాడు భక్త. ఏంటి పాత గొడవలు ఇంకా మర్చిపోలేదా అనడంతో ఎలా మర్చిపోతాం రా నువ్వు చేసిన పనికి నిన్ను నిలువుగా నరికి పారేయాలి అని అంటాడు.

మురళి పై కోపంతో రగిలిపోతున్న పార్వతి

ఆయన సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చావు అనడంతో వీడు మనిషి అయితే కదా పార్వతి జంతువు వీడు ఒరేయ్ ఫస్ట్ నా ముందు నిలబడకు వెళ్ళిపో అని అంటుంది పార్వతి వాళ్ళ అక్క. అప్పుడు మురళి వాళ్ళతో వాదిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి పద్మావతి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు మురళి నిజం చెప్పబోతుండగా ఆపు అని అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తుంది పద్మావతి. నీకు ఏం పని రా ఇక్కడ అని అరుస్తుండగా ఇంతలో అక్కడికి అరవిందా వస్తుంది. ఎందుకు మా ఆయన మీద అరుస్తున్నారు అని అంటుంది అరవింద. దాంతో పార్వతీ ఫ్యామిలీ అందరూ టెన్షన్ పడుతూ ఉండగా భక్త అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. అప్పుడు అందరూ కలిసి పదే పదే పద్మావతి విక్కీని అన్నా చెల్లెలు అనడంతో ఆ మాటలు విని తట్టుకోలేకపోతుంటాడు మురళి.

ఇప్పుడు భక్త వాడు అసలే నీచుడు వాడితో కాస్త జాగ్రత్తగా ఉండు అమ్మ అని కూతురికి జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. మరొకవైపు విక్కీ పని చేసుకుంటూ ఉండగా అప్పుడు ఆకలి కావడంతో ఏంటి ఇంత పొద్దున్నే ఆకలి అవుతుంది ఏదైనా ఆర్డర్ పెడదామా అనుకుంటుండగా వద్దులే మళ్ళీ అక్క ఫీల్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పద్మావతి అక్కడికి పాలు తీసుకొని వస్తుంది. ఎందుకు ఈ పాలు అనడంతో మొన్న నా మెడలో తాళిబొట్టు కట్టారు కదా ఈరోజు మనం ఫస్ట్ నైట్ అనడంతో విక్కీ షాక్ అవుతాడు. అప్పుడు పద్మావతి సిగ్గుపడుతూ మాట్లాడుతుండగా ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని సీరియస్ అవుతాడు విక్కీ. అయినా మీ కోపం నామీద కాదు ఆకలి మీద అని నాకు తెలుసు. అయినా మీ ఆకలి గురించి నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా ఎంతైనా మీరు నా భర్త కదా అని అంటుంది.

పద్మావతి విక్కీ లను విడగొట్టే ప్రయత్నంలో మురళి

ఈరోజు మనిద్దరం కలిసి ఉపవాసం ఉండాలి సారు అనడంతో ఏం మాట్లాడుతున్నావు అనగా ఇంతలో అక్కడికి మురళి వస్తాడు. ఉపవాసం దేనికి అని అడగడంతో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి చెప్పబోతుండగా ఈ ఎక్స్ట్రాలు మాత్రం వద్దు వెళ్లి భోజనం అయిన తర్వాత నన్ను పిలువు వచ్చి తింటాను అనడంతో ఇప్పుడే చెప్పాను కదా సారు ఈరోజు మొత్తం ఉపవాసం అనడంతో ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. అందుకే ఈ పాలు తీసుకువచ్చాను తాగండి అని అంటుంది పద్మావతి. అప్పుడు ఇద్దరం కలిసి గుడికి వెళ్లాలి అని పద్మావతి వికీ మాట్లాడకుంటూ ఉండగా మురళి ఆ మాటలు విని మిమ్మల్ని ఎలా విడగొట్టాలో నాకు తెలుసు అని మరో ప్లాన్ వేస్తాడు. ఆ తరువాత విక్కీ పాలు తాగడంతో పాలు మొత్తం మూతికి అంటడంతో చీర కొంగుతో మూతి తుడుస్తుంది. అప్పుడు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 30, 2023 at 8:16 ఉద.