Nuvvu Nenu Prema November 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి ఇప్పుడు ఎలా ఉంది సారు బాగానే ఉంది కదా ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ టాబ్లెట్ వేసుకోండి అనడంతో పద్మావతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు విక్కీ. ఏంటి సారు అలా చూస్తున్నారు. అసలు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని కంగారుతో మాట్లాడుతూ ఉంటుంది పద్మావతి. నిన్న రాత్రి మీకు అలా అయిపోయినందుకే నాకు ప్రాణం పోయినట్టు అయింది. ఆ టెన్షన్ నేను తట్టుకోలేను ఒకవేళ మీకు ఏదైనా అయితే ముందుగా నాకే అవ్వాలా అని ప్రేమగా మాట్లాడడంతో విక్కీ పద్మావతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అరవింద కూడా సంతోష పడుతూ ఉంటుంది.
విక్కీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్న పద్మావతి
మీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను నేను బతకలేను సారు అని అంటుంది. అప్పుడు విక్కీ నువ్వు లోలోపల గిల్టీగా ఫీల్ అవుతూ పద్మావతి వైపు చూస్తుండగా పద్మావతి టాబ్లెట్ ఇచ్చి కాఫీ ఇస్తుంది. అప్పుడు విక్కీ పైకి లేచి నాకు ఏమవుతుందని టెన్షన్ గా ఉన్నావు కదూ అనడంతో అవును సార్ మీరు చెప్పే వరకు నాకు కాళ్ళు,చేతులు ఆడలేదు అనడంతో విక్కి నవ్వుతూ అయితే నా ఐడియా బాగానే వర్క్ అవుట్ అయింది అనడంతో ఏం మాట్లాడుతున్నారు సారు అనగా నాకు బాగా లేకపోతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని అనుకున్నాను పర్లేదు నేను అనుకున్న దాని కంటే బాగానే టెన్షన్ పడ్డావు అని అంటాడు.
అంతా నటన అంటున్నా విక్కీ
ఆ మాటలు విని అరవింద కూడా అలాగే చూస్తూ ఉంటుంది. నీకు అర్థం అయ్యేలా నేను చెప్తాను నిన్న రాత్రి నాకు ఏమీ అవ్వలేదు నేను జస్ట్ ఊరికే యాడ్ చేశాను అని అంటాడు విక్కీ. ఇది కూడా నీకోసమే చేశాను నువ్వు నిన్నంతా పిచ్చి పిచ్చి యాక్టింగ్ తో నాకు చాలా కోపం తెప్పించావు. అందుకే నేను కూడా నటించి నీకు చూపించాను అని అంటాడు విక్కీ. ఆ మాటలు విన్న అరవింద ఎమోషనల్ అవుతుంది. అప్పుడు పద్మావతి ఎమోషనల్ అవుతూ ఏంటి స్వామి ఇది నేను ఆయనపై ప్రేమ పెంచుకుంటే ఆయన నా మీద రోజురోజుకు ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉన్నారు అని అనుకుంటూ ఎమోషనల్ అవుతుంది.
తమ్ముడు కళ్ళు తెరిపించిన అరవింద
తర్వాత విక్కీ బయటకు వెళ్తుండగా అరవింద ఎదురుపడటంతో అప్పుడు విక్కీ మాట్లాడించినా కూడా అరవింద పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం జరిగింది అక్క అనడంతో అరవింద మౌనంగా విక్కీ వైపు చూస్తూ ఒక చోటికి పిలుచుకొని వెళుతుంది. ఒక ఫోటో చూపించి నీకు ఒక ఫోటో ఈ ఫోటో గుర్తుందా అని అడుగుతుంది. ఆ ఫోటో చూసి ఎమోషనల్ అయిన విక్కీ అమ్మ ఇద్దరికీ తీయించిన ఫోటో ఇది దీనిని ఎలా మరిచిపోతాను అక్క అనడంతో మర్చిపోలేకనే దీనిని గుర్తుగా ఇల్లు వదిలి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అని అంటుంది అరవింద. దానిని కింద పడేసింది కూడా నేనే పొరపాటున జరిగింది అని అంటాడు విక్కీ.
అరవింద మాటలకు ఎమోషనల్ అయిన విక్కీ
అబద్ధం చెప్పినా కూడా అతికినట్టు ఉండాలి విక్కీ ఎందుకంటే ఆ ఫోటో పగలగొట్టింది నేను. కానీ అమ్మ నన్ను ఎక్కడ తిడుతుందో అని ఆ నేరాన్ని నీ మీదకు వేసుకున్నావు అని బాధగా మాట్లాడుతుంది అరవింద. మా విక్కి అంటే ఏంటో తన మంచి తనం ఏంటో ఇప్పటికి నీ కళ్ళలో నాకు కనిపిస్తోంది. అందుకే కదా ఇందాక నువ్వు పద్మావతికి నటించాను అని అబద్ధం చెప్పావు అనడంతో విక్కీ షాక్ అవుతాడు. కానీ నువ్వు పద్మావతిపై ఉన్న ప్రేమతోనే అలా చేశావని నాకు తెలుసు అని అంటుంది అరవింద. పద్మావతిపై గుండెల్లో బోలెడంత ప్రేమను పెట్టుకొని బయట మాత్రం కోపాన్ని నటిస్తున్నావు అనడంతో విక్కీ ఆ మాటలకు షాక్ అవుతాడు.
నువ్వు తనని ఇప్పటికీ ప్రేమిస్తున్నావు అది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది అరవింద. తర్వాత పద్మావతి కిచెన్ లో ఆలోచిస్తూ వంటలు చేస్తూ ఉంటుంది. విక్కీ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పద్మావతి వాళ్ళ నాన్న రావడంతో అను పద్మావతి వెళ్లి ప్రేమగా పలకరిస్తారు. అప్పుడు పద్మావతిని చూసి ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడగగా ఏమీ లేదు అని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది పద్మావతి. ఆ తర్వాత అరవింద వాళ్ళు అక్కడికి వచ్చి పద్మావతి వాళ్ళ నాన్నను ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. మీకోసం మా ఇంటి వాళ్ళు ప్రేమగా పిండి వంటలు పంపించారు అని అంటాడు. మీకు ఎందుకు శ్రమ అని అంటుంది అరవింద.
Nuvvu Nenu Prema November 16 Today Episode: భక్త ని అవమానించిన కుచల
అప్పుడు కుచల వాళ్లకు చేతనయింది అదే కదా అంటూ అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నారాయణ ఇంత వయసు వచ్చిన ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా అని భార్య నోరు మూయిస్తాడు. చెల్లెమ్మ రాలేదా అని నారాయణ అనడంతో లేదు తిరుపతి కి వెళ్ళింది అనగా అదే సంగతి వాళ్ళ భార్య వచ్చే వరకు మన ఇంట్లోనే తిష్ట వేద్దామని వచ్చాడు అని అవమానిస్తుంది కుచల. అప్పుడు పద్మావతి వాళ్ళ నాన్న పిల్లలకు ఒడిబియ్యం పోయాలి అని మాట్లాడడంతో అందరూ ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరేమి భయపడకండి బావగారు పిల్లలందరూ మీ ఇంటికి వస్తారు అని అంటాడు నారాయణ. సరే నేను వెళ్ళొస్తానమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పద్మావతి వాళ్ళ నాన్న పుట్టింటికి వెళ్లే సంతోషంలో అను పద్మావతి సంతోష పడుతూ ఉంటారు.