Nuvvu Nenu Prema November 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ బట్టలు పట్టకపోవడంతో బ్యాగ్ కి జిప్పు వేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. సాయి శక్తుల ప్రయత్నించిన ఆ జిప్పు వేయడానికి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక పద్మావతి వెంటనే ఆ బ్యాగు పైకి ఎక్కి జిప్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో విక్కీ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ నువ్వు అని అడగగా జిప్పు వేయడం రావడం లేదు సార్ కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతుంది. అప్పుడు విక్కీ పద్మావతికి దగ్గరగా వచ్చి ఆ జిప్పు వేస్తూ ఉండగా పద్మావతి విక్కీ కళ్ల లోకి అలాగే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత జిప్ వేయడం అయిపోవడంతో ఇదేంటి నువ్వు నా పర్మిషన్ లేకుండా నా లగేజ్ బ్యాగ్ ఎందుకు తీసుకున్నావు ఇది నాది కదా అనడంతో నీది నాది కాదు సార్ మనది అని అంటుంది పద్మావతి.
సంతోషంలో ఆర్య అను
మీరు తొందరగా రెడీ అయి రండి మా నాన్న వచ్చాడు మనకు ఒడి బియ్యం పోస్తానని చెప్పి వెళ్లారు మనం మా పుట్టింటికి వెళ్ళాలి అనడంతో నేను అసలు రాను అని అంటాడు విక్కీ. మరొకవైపు అను బట్టలు సర్దుతూ ఉండగా ఆర్య అక్కడికి వస్తాడు. ఏంటి మేడం గారు సంతోషంగా బట్టలు సర్దుతున్నారు అనడంతో అప్పుడు అను అసలు విషయం చెప్పగా ఆర్య కూడా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు పద్మావతి పుట్టింటికీ వెళ్లే సంతోషంలో ఇల్లు పీకి పందిరి వేస్తుందీ కదా అనగా దాని ఆనందం విక్కీ గారి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆఫీస్ వర్క్ అంటుంటారు కదా అని అంటుంది అను. అప్పుడు ఆర్య అవును అంటూ వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
భర్తను బ్రతిమలాడుతున్న పద్మావతి
మరోవైపు అరవింద అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఆర్య అను వస్తారు. అప్పుడు అందరూ సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత విక్కీ పని చేసుకుంటూ ఉండగా పద్మావతి అక్కడికి వచ్చి ఇదే సారు మీతో వచ్చిన తిప్పలు కిందన అందరు మనకోసం ఎదురు చూస్తుంటే మీరు ఏంటి ఇంకా ఇలాగే ఉన్నారు వెళ్దాం పదండి అని అంటుంది. నువ్వు ఎన్నిసార్లు బ్రతిమిలాడిన నా సమాధానం ఒక్కటే నేను మీ ఇంటికి రాను అని అంటాడు విక్కీ. ఆ తర్వాత అరవింద వాళ్ళు కిందికి రాలేదు అని చెప్పి తనే వాళ్ళని పిలుచుకొని రావడానికి పైకి వెళ్తుంది. మరోవైపు పద్మావతి ఎంత బ్రతిమలాడుతున్నా కూడా విక్కీ రావడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడు. పసుపు తాడుతో ఇలాగే పుట్టింటికి వెళ్ళకూడదు సారు అందుకే మీతో మళ్ళీ నా మెడలో తాళి వేయించి ఇక్కడ నుంచి మనకు బట్టలు పెట్టి పంపిస్తారు అని అంటుంది పద్మావతి.
పద్మావతిపై సీరియస్ అయిన విక్కీ
అయినా కూడా విక్కీ అలాగే మంచంపై కూర్చోవడంతో రండి అని చేతిలో ఉన్న లాప్టాప్ గుంజుకోవడంతో నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని సీరియస్ అవుతాడు విక్కీ. అప్పుడు విక్కీ పద్మావతిపై సీరియస్ అయ్యి మన మధ్య ఉన్నది ప్రేమ కాదు నటన అని ఎప్పుడో చెప్పాను అని అంటుండగా ఇంతలో అక్కడికి అరవిందా వస్తుంది. మనది నిజమైన పెళ్లి కాదు అగ్రిమెంట్ మ్యారేజ్ మరో మూడు నెలల్లో మనం విడిపోతాము అలాంటప్పుడు ఇవన్నీ అవసరమా అనడంతో ఆ మాటలు విన్న అరవింద ఒక్కసారిగా విక్కీ అని గట్టిగా అరుస్తుంది. దాంతో పద్మావతి విక్కీ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంట్రా మీ మూడుముళ్ల బంధాన్ని ఒప్పందం అని అంటున్నావు అని అడుగుతుంది అరవింద. మీ మధ్య జరిగింది పెళ్లి కాదా ఒప్పందమా అని అరవింద ఒక క్షణం కళ్ళు తిరిగినట్టు పడిపోతుండగా విక్కి పట్టుకోడానికి వెళ్లడంతో వదలండి నన్ను పట్టుకోవద్దు అని అసహ్యించుకుంటుంది.
నిజం తెలిసి షాక్ అయిన అరవింద
ఏం జరిగిందో చెప్పండి అని అరవింద ఎమోషనల్ అవ్వగా బాధపడకు అక్క అనడంతో గుండె పగిలే నిజం తెలిసిన తర్వాత చావు వస్తుందే తప్ప ప్రశాంతత ఎలా వస్తుంది అనడంతో అక్క నువ్వు అలా మాట్లాడకు అని అంటాడు విక్కీ. మీ ఇద్దరి కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నాను ఎన్నో పూజలు చేశాను. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమగా ఉన్నారని నేను అనుకున్నాను. కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదు అది నాటకాలు అని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నాతో పాటు మన అమ్మను కూడా మోసం చేశావు అని అనగా అలా మాట్లాడకు. నేను చెప్పేది విను అనడంతో నేను విన్నాను కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నాను అని అంటుంది అరవింద. మిమ్మల్ని కూడా ఎంతో బాగా నమ్మాను పద్మావతి గారు మీరు కూడా నన్ను మోసం చేశారు అని అంటుంది అరవింద. అప్పుడు పద్మావతి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తలదించుకుంటుంది.
తమ్ముడుని చూసి అసహ్యించుకుంటున్న అరవిందా
ఇద్దరు కలిసి మీపై పెట్టుకుని నమ్మకాలను నాశనం చేశారు అని అంటుంది అరవింద. ఒప్పందంతో చేసుకున్న పెళ్లి అయితే అసలు మీరిద్దరూ ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారు అని నిలదీస్తుంది. అప్పుడు విక్కీ మనసులో నిజం చెప్తే నువ్వు బతకలేవు అక్క నీ మొగుడు ఒక మోసగాడు నీచుడు అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని అనుకుంటూ ఉంటాడు. ఈ నిజం మీకు చెప్పలేని వదినా శ్రీనివాస నువ్వే కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడు అరవింద ఇద్దరూ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఏంటి అని అంటుంది. మీరిద్దరూ ప్రేమించుకున్నారని అందుకే పెళ్లి చేసుకున్నారని అనుకున్నాను కానీ మీరు ఇద్దరు పెళ్లి చేసుకోమని మేము చెప్పలేదు కదా.
Nuvvu Nenu Prema November 17 Today Episode: అరవింద మాటలకు షాకైన పద్మావతి
మీ ఇద్దరిదీ అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిస్తే నానమ్మ ఏం అవుతుంది మీ నాన్న బతకగలడా అని అంటుంది అరవింద. మీ ఇద్దరి వల్ల రెండు కుటుంబాలు సర్వనాశనం అవుతాయి అని అంటుంది అరవింద. మీ వల్ల కుటుంబాలు బలవ్వడానికి నేను ఒప్పుకోను అని అంటుంది అరవింద. అయినా మీరు ఇద్దరు ఇలా ఎందుకు చేశారో నాకు ఈ క్షణమే తెలిసి తీరాలి చెప్పండి. ఇప్పుడు గనక మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని ఒట్టు వేసుకుంటుంది అరవింద. దాంతో విక్కీ,పద్మావతి ఇద్దరి షాక్ అవుతారు.