Nuvvu Nenu Prema November 18 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో ఇప్పుడు కనుక మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అనడంతో అప్పుడు పద్మావతి శ్రీనివాస ఏంటయ్యా ఇలా చేస్తున్నావు ఎవరి కోసం అయితే ఇన్ని రోజులు నిజం దాచామో ఆవిడే ఇప్పుడు నిజం చెప్పమని అంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వికీ అమ్మ చనిపోవడంతో నాకు అన్ని నువ్వే చూసుకున్నావు. అలాంటిది నీ భర్త ఒక నీచుడు అన్న విషయాన్ని నీకు ఎలా చెప్పాలి అక్క అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇద్దరు చిన్న పిల్లలు కాదు కదా తప్పు చేయడానికి అందరి గురించి తెలిసిన వాళ్ళు. మీరిద్దరూ ఇలా చేశారు అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అది ఏంటో నాకు తెలియాలి చెప్పు విక్కీ అని నిలదీస్తుంది అరవింద.
నిందను తనపై వేసుకున్న పద్మావతి
అక్క ప్లీజ్ నా మాట విను నేను నీకు నెమ్మదిగా నిజం చెప్తాను అనడంతో లేదు నాకు ఇప్పుడే నిజం తెలియాలి అని పట్టుబడుతుంది అరవింద. లేదంటే ఇప్పుడే నేను చచ్చిపోతాను అని అంటుంది అరవింద. అప్పుడు పద్మావతి అరవింద విక్కీ మంచి కోరి నిందను తనపై నెట్టేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. నిజం చెప్తారా లేక చచ్చిపొమ్మంటారా అని బెదిరిస్తుంది అరవింద. అప్పుడు నేను చెప్తాను వదిన అని పద్మావతి అనడంతో విక్కీ షాక్ అవుతాడు. జరిగిన దాంట్లో ఆయన తప్పేమి లేదు. తప్పంతా నాదే అనడంతో మీరు ఇలా ఎందుకు పెళ్లి చేసుకున్నారు కారణం ఏంటి అని అడుగుతుంది అరవింద.
పద్మావతి మాటలకు ఆశ్చర్యపోయిన విక్కీ
అప్పుడు పద్మావతి నన్ను ఒక నీచుడు బెదిరిస్తున్నాడు మా అక్క పెళ్లి సమయంలో కూడా నన్ను బెదిరిస్తూ ఉండడంతో నేనే నా మెడలో తాళి కట్టామని విక్కీ గారిని బలవంత పెట్టాను అని అబద్ధాలు చెబుతుంది పద్మావతి. అప్పుడు పద్మావతి మాటలకు షాక్ అవుతాడు విక్రమాదిత్య. అరవింద కూడా ఆశ్చర్య పోతుంది. విక్కీది తప్పేమీ లేదు అంతా తనదే అన్నట్టుగా తప్పును మొత్తం తన మీద వేసుకుంటుంది పద్మావతి. నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అనడంతో మీ బాధను నేను అర్థం చేసుకోగలను పద్మావతి. నిన్ను మోసం చేసి మీ వాళ్లను చిత్ర హింసలు పెట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆ నీచుడు ఎవరూ చెప్పు పద్మావతి అని నిలదీస్తుంది అరవింద.
విక్కీ పద్మావతి లను కలిపిన అరవింద
నాకు చెప్పండి వాడు ఎవడో బతకకూడదు అంటుంది అరవింద. అప్పుడు పద్మావతి మీరు ఆవేశ పడకండి వదినా మాకు పెళ్లి అయిన తర్వాత వాడు నా జోలికి రాలేదు అనడంతో విక్కీ కూడా అవును అక్క నువ్వు ఆవేశపడకు అని అంటాడు. అప్పుడు అరవింద మీ పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరిగినా కూడా మీ ఇద్దరు ఒప్పందం ప్రకారం ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. ఒకసారి మనం మెడలో తాళి పడిన తర్వాత మనం దానికి విలువ ఇవ్వాలి. అలాగే మీరిద్దరూ ఇప్పటివరకు ఏం చేసినా కూడా ఈ రెండు కుటుంబాల క్షేమం కోసమే చేశారు. ఇకపై కూడా ఈ రెండు కుటుంబాల సంతోషము మీ పైన ఆధారపడి ఉంది. కాబట్టి జరిగిన విషయాలు పక్కన పెట్టి జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. మీ భార్య భర్తల బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి.
అరవిందకు మాట ఇచ్చిన విక్కీ
ఇకనుంచి నువ్వు పద్మావతి కలిసి మెలిసి ఉండాలి అలా ఉంటానని నాకు మాట ఇవ్వండి అని అంటుంది అరవింద. అప్పుడు విక్కీ మనసులో పద్మావతి కోసం కాదు అక్క నీ సంతోషం కోసం మాట ఇస్తున్నాను అని అరవిందకు మాట ఇస్తాడు. దాంతో అరవింద పద్మావతి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మీరు ఒప్పందం పేరుతో విడిపోవాలని ప్రయత్నిస్తే ఇద్దరి ప్రాణాలు పోతాయి అనడంతో విక్కీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఒకటి నా ప్రాణం రెండవది నా కడుపులో పెరుగుతున్న అమ్మ ప్రాణం అనడంతో అక్క అలా మాట్లాడకు అని అంటాడు విక్కీ. నువ్వు అమ్మ క్షేమంగా ఉండాలి అనడంతో అయితే ఏ తులాభారం సమయంలో అయితే పద్మావతి మెడలో పసుపు తాడు కట్టావో ఇప్పుడు మా అందరి సమక్షంలో మరొకసారి పద్మావతి మెడలో తాళి కట్టాలి అనడంతో విక్కి షాక్ అవుతాడు.
Nuvvu Nenu Prema November 18 Today Episode: సంతోషంలో అను ఆర్య
తర్వాత విక్కీ అరవింద పద్మావతి ముగ్గురు కలసి కిందికి వెళ్తారు. అప్పుడు ఆర్య ఏంటి పద్మావతి పుట్టింటికి వెళ్తున్న సంతోషం నీ ముఖంలో కనిపించడం లేదు అని అడుగుతాడు. అప్పుడు అందరి ముందు అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది అరవింద. తన భర్త పై ఉన్న ప్రేమతో తన భర్తకి ఆఫీస్ వరకు డిస్టర్బ్ కాకూడదని పద్మావతి ఆలోచిస్తోంది అంటూ అబద్దాలు చెబుతుంది అరవింద. ఆ మాటలకు అను ఆర్య ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. తర్వాత అరవింద చెప్పినట్టుగా పద్మావతి విక్కీ ఇద్దరు కలిసి మళ్ళీ పూజలో కూర్చుంటారు. ఇద్దరు కలిసి పూజలు చేస్తూ ఉంటారు.