Nuvvu Nenu Prema November 21 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పార్వతి పిల్లల కోసం ఎదురుచూస్తూ వాళ్ళ ఆయన్ను పిలిచి పిల్లల్ని రమ్మని చెప్పిండారా లేకుంటే వీలు చూసుకుని రమ్మని చెప్పారా అనడంతో మనకి కూడా పిల్లల్ని చూడాలని ఉండదా ఇప్పుడే రమ్మని చెప్పాను ఇంకా రాలేదేంటి అనగా వస్తారులే పార్వతి నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు భక్త. అక్కడ వాళ్లు అన్ని చూసుకొని రావాలి కదా అని అంటాడు. అప్పుడు అందరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే పద్మావతి, విక్కీ ఇంటికి వస్తారు. అప్పుడు పద్మావతి ఇక్కడి నుంచి వెళ్లే లోపు అమ్మ వాళ్లకు అనుమానం లేకుండా చేయాలి సార్ ని ఎలా అయినా నా వైపు తిప్పుకోవాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు విక్కీ జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.
అరవింద పేరు చెప్పి విక్కిని భయపెడుతున్న పద్మావతి
అప్పుడు పద్మావతి టెంపరోడు చెప్తే వినేలా లేడు అనుకుని ఇప్పుడు మీరు ఇలాగే ఉంటే మా వాళ్లకు టెన్షన్ వస్తుంది ఆ తర్వాత అరవింద గారి నుంచి నీకు ఫోన్ వస్తుంది అనడంతో విక్కీ ఆలోచనలో పడతాడు. పద్మావతి లగేజ్ అంతా మోస్తుండగా ఎందుకు నువ్వు ఒక్కదానివే మోస్తావు ఇటు ఇవ్వు నేను కూడా మోస్తాను అని అంటాడు విక్కీ. అప్పుడు పద్మావతి ఓవర్ చేస్తూ నేను కష్టపడ్డా మీరు చూడలేకపోతున్నారు ఇదే కదా సారు ప్రేమ అంటే ప్రాణంతో అలాంటివి ఊహించుకోకు అని అంటాడు విక్కి. అప్పుడు అక్కడ ఉన్న ముగ్గు చూసి పద్మావతి, విక్కీ ఇద్దరు ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు పద్మావతి ముగ్గు తొక్కకుండా ఇంట్లోకి వెళ్లిపోవడంతో అప్పుడు విక్కీ మొగ్గు తొక్కకుండా ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
పద్మావతి విక్కీ మధ్య రొమాంటిక్ సీన్
అప్పుడు పద్మావతి చెప్పిన విధంగా ముగ్గు తొక్కకుండా మధ్యలో గంతులు వేస్తూ వెళ్తూ ఉండగా విక్కీ పడిపోతుండడంతో పద్మావతి పట్టుకుంటుంది. అప్పుడు ఇద్దరూ ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. మరొకవైపు మురళి దొంగ చూపులు చూస్తూ దొంగలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎవరూ చూడకుండా ఎవరికంట పడకుండా మురళి విక్కీ గదిలోకి వెళ్లి సీక్రెట్ లాకర్ తాళం ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో పని చేసే వ్యక్తి అక్కడికి వచ్చి మురళిని చూస్తాడు.
మరో ప్లాన్ వేసిన మురళి
నేను ఫ్రెష్ అప్ అవుదామని వచ్చాను నువ్వు నీ పని చూసుకో అని వాష్ రూమ్ లోకి వెళ్లి తలుపు పెట్టుకుంటాడు మురళి. అప్పుడు పక్కనే ఉన్న సబ్బుకి కీ పెట్టి గట్టిగా ప్రెస్ చేసి దొంగ కీ తయారు చేసుకోవడానికి ప్లాన్ వేస్తాడు. మరొకవైపు ఆర్య, అను ఇద్దరు కలిసి పుట్టింటికీ వస్తారు. అప్పుడు కూతుళ్లు,అల్లళ్ళు రావడంతో పార్వతి సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు అరవింద మొక్కలకు నీళ్లు పడుతూ ఉండగా అప్పుడు మురళి పిలుస్తున్న పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో సరదాగా మురళి పైకి నీళ్లు పెడుతుంది అరవింద. అప్పుడు చెప్తే అర్థం కాదా ఇంకా ఆపు అని గట్టిగా అరుస్తాడు మురళి. తర్వాత అరవిందకి అనుమానం రాకుండా చూసుకోవాలి అని ప్రేమ చూపిస్తునట్టు నటిస్తాడు.
Nuvvu Nenu Prema November 21 Today Episode: సంతోషంలో పద్మావతి
అప్పుడు పద్మావతి పుట్టింటికి రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు విక్కీ అక్క కోసం ఈ నాలుగు రోజులు దీన్ని టార్చర్ భరించక తప్పదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇద్దరు మళ్లీ పన్నిగా వాదించుకుంటూ ఉంటారు. విక్కీ పద్మావతివైపు అలాగే చూస్తుండగా ఏంటి సార్ నేను అంత అందంగా ఉన్నానా నా వైపు అలాగే చూస్తున్నారు అనడంతో సొంత డబ్బా కొట్టుకోవడం ఆపు అని అంటాడు విక్కీ. అప్పుడు విక్కీని పద్మావతి శ్రీవారు అని పిలవడంతో నన్ను అలా పిలవకు అని అనగా మరి ఎలా పిలవాలి అని అడుగుతుంది పద్మావతి.