Nuvvu Nenu Prema November 23 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో విక్కీ పద్మావతి చీర కొంగుతో చెయ్యి తుడుచుకుంటూ ఉండగా అప్పుడు పద్మావతి తెగ సంతోషపడి మురిసిపోతూ ఇంత ప్రేమను మీలో ఎందుకు దాచుకుంటున్నారు సారు అని అంటుంది. ఇంతలోనే పార్వతీ ఫ్యామిలీ అందరూ అక్కడికి వచ్చి విక్కీ వాళ్ళని చూసి సంతోష పడుతూ ఉంటారు. ప్రేమ లేదు నువ్వు పెద్దగా ఊహించుకోకు అక్కడ మీ వాళ్ళు చూస్తున్నారు అందుకే ఇలా చేస్తున్నాను అనడంతో పద్మావతి సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి పార్వతి వాళ్ళు ఎప్పటికీ వీళ్ళ మధ్య ప్రేమ అన్యోన్యత ఇలాగే ఉండాలి అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటారు.

ఆర్యకి గుడ్ న్యూస్ చెప్పిన అను

తర్వాత విక్రమాదిత్య పీఏ కి ఫోన్ చేసి తనకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని పంపించమని చెబుతాడు. ఆ తరువాత అను పని చేసుకుంటూ ఉండగా ఆర్య వెళ్లి వెనుక వైపు నుంచి హత్తుకోవడంతో అను డల్ గా ఉండడం చూసి ఏమయింది అని కంగారుపడుతూ అడుగుతాడు. కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది తలనొప్పిగా ఉంది అని అను వెళ్లి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అను బయటకు వచ్చి గుడ్ న్యూస్ చెప్పడంతో ఆర్య సంతోష పడుతూ ఉంటాను. ఈ విషయం అందరికి చెబుదాము పదా అనగా ఇప్పుడే వద్దు ఒకసారి కన్ఫామ్ చేసుకొని ఆ తర్వాత చెబుదాము అని అంటుంది అను. మరొకవైపు విక్కీ పద్మావతి చేసిన పనిని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నేను సైలెంట్ గా ఉండడం చూసి ఈ పద్మావతి రెచ్చిపోతోంది అని అనుకుంటూ ఉండగా ఇంతలా అక్కడికి పద్మావతి మజ్జిగ తీసుకొని వస్తుంది.

పద్మావతిని విసుకుంటున్న విక్కీ

ఎందుకు పదే పదే విసిగిస్తున్నావు నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయడంతో ఏంటి సార్ అలా మాట్లాడతారు అని అంటుంది పద్మావతి. ఆ దేవుడు నీకు నాకు ముడిపెట్టాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని అంటుంది పద్మావతి. అయినా ప్రేమ లేకపోతే మీరు ఇంతవరకు రారు కదా అనగా నేను మా అక్క కోసం వచ్చాను నీకోసం కాదు నువ్వు ఊహల్లో తేలిపోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో విసుక్కుంటాడు విక్కీ. మీరే నా సొంతమైనప్పుడు నేను ఊహల్లో ఎందుకు తేలిపోతాను సారు అని అంటుంది పద్మావతి. అరవింద పద్మావతి వాళ్ళ గురించి ఆలోచిస్తూ పద్మావతికి వీడియో కాల్ చేయడంతో పద్మావతి వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. మీరేం గొడవ పడుతున్నారా అనడంతో లేదు వదినా బాగానే ఉన్నాము అనడంతో విక్కీ ఎక్కడ అని అడుగుతుంది అరవింద.

విక్కీకి ముద్దుపెట్టిన పద్మావతి

అప్పుడు విక్కీ అటువైపు తిరిగి నిల్చొని ఉండడంతో ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నాడు అని అంటుంది అరవింద. అప్పుడు ఏం లేదు అక్క నువ్వు ఏం టెన్షన్ పడకు అని విక్కీ అనగా పద్మావతి దానికి కవర్ చేయడానికి మా అమ్మ వాళ్ళు కూరల్లోకి కాస్త ఎక్కువ వేశారు అందుకే ఆయన అలా ఉన్నారు అని అంటుంది. విక్కీ కారం ఎక్కువగా తినడు. కారం తింటే తనకు కోపం వస్తుంది అని అరవింద చెప్తుంది. అయినా కోపాన్ని తగ్గించే మంత్రం నా దగ్గర ఉన్నది అనగా అదేంటి అని అడుగుతుంది అరవింద. అప్పుడు వీడియో కాల్ లో అరవింద వైపు చూస్తూ విక్కీకి ముద్దు పెడుతుంది పద్మావతి. అరవింద సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే పద్మావతి విక్కీ ఇద్దరు ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. అప్పుడు పద్మావతి ఎవరైనా కోపంగా ఉంటే ఇలా చేస్తే చాలు కూల్ అవుతారు అని అంటుంది. అప్పుడు అరవింద ఎవరైనా మనకు ఏదైనా ఇస్తే తిరిగి ఇవ్వాలి అని అనడంతో విక్కీ షాక్ అవుతాడు.

Nuvvu Nenu Prema November 23 Today Episode: పద్మావతికి ముద్దు పెట్టిన విక్కీ

అప్పుడు అరవింద చెప్పినట్టుగా విక్కీ పద్మావతికి ముద్దు పెట్టడంతో పద్మావతి షాక్ అవుతుంది. పద్మావతి చాలా సంతోషపడుతుండగా అది చూసి అరవింద సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరొకవైపు గాలి ఆడక పోవడంతో ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయలేదు అని విక్కీ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఏసీ షాప్ వాళ్లకి ఫోన్ చేసి ఒక ప్రదేశంలో ఏసీ బిగించాలి అని అడ్రస్ చెబుతాడు విక్కి. ఆ తర్వాత పద్మావతి వాళ్ళ ఇంటికి బంధువులు రావడంతో వెళ్లి సంతోషంగా పలకరిస్తూ ఉంటుంది. తర్వాత విక్కిని పిలుచుకుని రావడానికి ఏ గదిలోకి వెళ్తుంది పార్వతి. అప్పుడు పార్వతి అసలు విషయం చెప్పబోతుండగా ఏసి వాళ్ళు బిగించడానికి వచ్చాడు అనుకుని బయటకు వెళ్తాడు విక్కీ. అక్కడ పద్మావతి బంధువులు ఉండటం చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు విక్కీ. అతి పద్మావతి వాళ్ళందరినీ విక్కీకి పరిచయం చేస్తూ ఉంటుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 23, 2023 at 8:13 ఉద.