Nuvvu Nenu Prema November 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో విక్రమాదిత్య పద్మావతి బంధువులతో ఇంగ్లీషులో మాట్లాడుతూ నాకు కొంచెం వర్క్ ఉంది మీరు ఏమీ అనుకోకండి అనడంతో ఒసేయ్ పద్మావతి మీ ఆయన ఏదో అంటున్నాడు అనడంతో అప్పుడు పద్మావతి విక్కీనీ ఇరికిస్తూ ఏమీ లేదు మీరు మా ఆయన్ని కలవడానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీతో కాసేపు మాట్లాడతాను అని అంటున్నారు అనడంతో విక్కీ షాక్ అవుతాడు. అప్పుడు ఆ పెద్దవిడా నీది ఎంత మంచు మనసు నాయినా అనగా ఇంతలోనే పద్మావతి వాళ్ళ అత్తయ్య మంచి అందగాడు శ్రీరామచంద్రుడు లాంటివాడు అనడంతో పద్మావతి కుటుంబ సభ్యులు సంతోషపడుతుండగా శ్రీరామచంద్రుడు లాంటివాడు కాదు శ్రీరామచంద్రుడే అని గొప్పలు చెబుతూ ఉంటుంది పద్మావతి.

పద్మావతి మాటలకు ఆశ్చర్యపోయిన విక్కీ

అప్పుడు విక్కీ పద్మావతి మాటలకు ఆశ్చర్యపోతాడు. అప్పుడు విక్కీని పద్మావతి మరింత అడ్డంగా బుక్ చేస్తాడు. అప్పుడు అందరూ పద్మావతిని, విక్కీని తెగ పొగిడేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చదువుకున్నావు నాయనా అనగా విక్కి ఎంబీఏ చదువుకున్నాను అని ఇంగ్లీషులో చెప్పడంతో ఏంటి అనాధాశ్రమంలో చదువుకున్నావా అంటూ వాళ్ళు అపార్థం చేసుకుని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండడంతో విక్కీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు పార్వతి మీరు అపార్థం చేసుకుంటున్నారు పెద్దమ్మ మా అల్లుడు గారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు తన కింద ఎంతోమంది పనిచేస్తున్నారు అనడంతో ఆ మాటకొస్తే మన వీధి చివర సరుకుల షాపులో కూడా ఆమె కింద చాలా మంది పని చేస్తున్నారు అనడంతో ఆ పెద్దావిడ మాటలకు విక్కీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

భర్తని వెనకేసుకొచ్చిన పద్మావతి

కాదు చైనాఫ్ ఇండస్ట్రీస్ అనడంతో చైన్స్ అమ్ముతావా అటు అయితే మా కోసం కొన్ని చైన్లు చూపించు మోడల్స్ ఉన్నాయా అని అడగడంతో విక్కీ షాక్ అవుతాడు. మీరు అనుకుంటున్నట్టు కాదు మా ఆయనకు చాలా కంపెనీలు ఉన్నాయని చెబుతున్నారు అనడంతో అయితే మీ ఆయన నిన్ను కాలు కింద పెట్టుకుండా చూసుకుంటున్నారు అనడంతో అప్పుడు ఇంట్లో అందరూ పద్మావతి వైపు చూసి సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ పెద్దావిడ వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో విక్కీ పద్మావతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. మరొకవైపు అరవింద సంతోష పడుతుండగా మురళి వచ్చి ఎందుకు సంతోషపడుతున్నావు అనడంత్తో చెప్తాను అని అంటుంది. నా సంతోషం వెనుక భయంకరమైన నిజం దాగుంది అని విక్కీ పద్మావతిల అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పడంతో మురళి షాక్ అవుతాడు.

మురళికి అసలు విషయం చెప్పిన అరవింద

అప్పుడు అరవింద చెప్పే మాటలకు మురళి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎలా అయినా వాళ్ళని నేను కలుపుతాను అనడంతో మురళి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత పార్వతి కూరగాయలు కట్ చేస్తుండగా నీకెందుకు అమ్మ ఇవన్నీ నేను చూసుకుంటాను కదా అనడంతో నువ్వు వెళ్లి మీ ఆయనకు ఏం కావాలో అడిగి చేసుకో అని అంటుంది పద్మావతి వాళ్ళ అత్తయ్య. మీకెందుకు మా ఆయనను నేను చూసుకుంటాను కదా పద్మావతి ఇక్కడ తగ్గేది లేదు అనడంతో వాళ్ళందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు పద్మావతి చిలకమ్మతో సరదాగా మాట్లాడడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏసీ బిగించే వాళ్ళు రావడంతో మేము మీకు ఏమి చెప్పలేదు కదా అనగా నేనే చెప్పాను అంకుల్ మీరు వెళ్లి ఆ రూంలో తొందరగా ఏసీ ఫిట్ చేయండి అని అంటాడు విక్కీ.

విక్కీని అపార్థం చేసుకున్న పద్మావతి

అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సారు అని పద్మావతి అనడంతో నాకు ఏసీ లేకుండా ఉండలేను అయినా మనం వెళ్ళిన తర్వాత అత్తయ్య వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కీ. ఇప్పుడిప్పుడే ఖర్చులు పెరుగుతున్నాయి అనుకుంటే మళ్ళీ ఏసీ ఖర్చు కూడానా అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ అల్లుడుగారు ఇక్కడ ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోవాలి పద్మావతి నువ్వు కూడా అల్లుడు గారిని బాధ పెట్టకు అని అంటారు. కానీ విక్కీ చేసిన పని నచ్చక పద్మావతి బాధపడుతూ ఉంటుంది. తర్వాత విక్కీ రావడంతో పార్వతి ఇది మీ ఇల్లే అనుకోండి మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండండి అని అంటుంది. ఆ తర్వాత విక్కీకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్లగా విక్కీని ఫాలో అవుతూ పద్మావతి కూడా బయటికి వెళుతుంది.

Nuvvu Nenu Prema November 24 Today Episode: పద్మావతి విక్కిలను కలిపే ప్రయత్నంలో ఆర్య

ఏంటి సార్ మీరు డబ్బున్నోళ్ళని మా వాళ్ళను ఇలా చులకనగా చూస్తున్నారా. కనీసం ఏది తెప్పించే ముందు మీరు ఒక్క మాటైనా చెప్పాలి కదా ఎందుకు ఇలా చేస్తున్నారు కోపం ఉంటే నా మీద చూపించండి మా వాళ్ల మీద కాదు అని రెచ్చిపోయి మాట్లాడుతుంది ఈ పద్మావతి. అప్పుడు విక్కీ మాట్లాడడానికి ప్రయత్నించగా పద్మావతి మాట్లాడకండి మౌనంగా ఉండండి అని అంటుంది. అప్పుడు విక్కీని అపార్థం చేసుకొని కోపంగా అరిచి అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఆ మాటలు విన్న అను ఆర్య ఇద్దరు బాధపడుతూ ఉంటారు. నువ్వేం బాధపడకు అను వాళ్ళిద్దర్నీ కలిపే మార్గం నా దగ్గర ఉంది నువ్వు ధైర్యంగా ఉండు అని ఒక సరికొత్త ప్లాన్ వేస్తాడు ఆర్య. ఆ తరువాత పద్మావతి జరిగిన విషయాలు తలచుకొని దిగులు చెందుతూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత పార్వతి వచ్చి మీ ఆయనతో కలిసి గుడికి ఇల్లు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆర్య సరికొత్త ప్లాన్ వేసి పద్మావతి నీకోసం ఎదురు చూస్తోంది అని టెర్రస్ పైకి వెళ్ళమని చెబుతాడు. అను పద్మావతి దగ్గరికి వెళ్లి విక్కీ గారు నీకోసం పైన ఎదురు చూస్తున్నారు వెళ్లాలి అని చెబుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 24, 2023 at 8:50 ఉద.