Nuvvu Nenu Prema November 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆర్య విక్కీ దగ్గరికి వెళ్లి నీకోసం పద్మావతి టెర్రస్ పైన ఎదురుచూస్తోంది వెల్లు విక్కీ అనడంతో అదేంటి అనగా ఏమో నాకేం తెలియదు తొందరగా వీళ్ళు విక్కీ అందంతో సరే అని విక్కీ అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తర్వాత అను పద్మావతి దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడ ఉన్నావా పద్మావతి నీకోసం విక్కీ గారు టెర్రస్ పైన ఎదురుచూస్తున్నారు. తొందరగా మేడ మీదకు వెళ్ళు అనడంతో కావాలంటే ఆయన కిందికి రావచ్చు కదా అక్క అనగా ఏమి తొందరగా వెళ్ళు అందంతో సరే అని పద్మావతి మేడ మీదకు వెళుతుంది. మరోవైపు విక్కీ నన్ను ఎక్కడికి రమ్మని చెప్పి తను ఎక్కడికి వెళ్లింది అని మేడ మీద ఎదురు చూస్తూ ఉంటాడు.

పద్మావతి విక్కీ మధ్య రొమాంటిక్ సీన్

అప్పుడు అను ఆర్య ఇద్దరు ప్లాన్ సక్సెస్, ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు అని సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత పద్మావతి మేడ మీదకు వెళ్లడంతో విక్కీ పద్మావతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు పద్మావతి కింద పడిపోతుండగా పట్టుకొని పద్మావతి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. చెప్పండి సారు ఎందుకు పిలిచారు అనగా నేను కాదు నువ్వు పిలిచావు అని అంటాడు విక్కీ. ఇదే సారు మీతో వచ్చింది ఏదైనా కూడా తప్పు ఒప్పుకోరు ఎదుటి వాళ్ళ మీదకే నెట్టేస్తారు అని పద్మావతి మళ్లీ ఫన్నీగా విక్కి తో వాదిస్తూ ఉంటుంది. నేను నీ విషయంలోనే కాదు ఎవరి విషయంలో కావాలని ఏది చేయను. మీ వాళ్ల విషయంలో కూడా నేను కావాలని ఏది చేయలేదు ఏసీ తప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టానని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, కానీ నేను ఏం చేసినా మీ వాళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చేశాను.

విక్కీ మాటలకు ఆశ్చర్యపోయిన పద్మావతి

మీ వాళ్ళను ఎప్పుడు తక్కువ చేసి చూడాలని కాదు ఇంటి అల్లులను అంత బాగా చూసుకునే వాళ్లకు ఎటువంటి కష్టం రాకూడదు ఇలాంటి కష్టం వచ్చినా కూడా నేను ముందు ఉండి ఆ కష్టాన్ని తీరుస్తాను అని అనడంతో విక్కీ మాటలకు పద్మావతి సంతోష పడుతూ అలాగే చూస్తూ ఉంటుంది. ఆ మాటకు వస్తే కష్టం అని తెలియకుండా నేను చూసుకుంటాను అనడంతో పద్మావతి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు కావాలనే పద్మావతి తన చేతిలో ఉన్న రింగు విక్కి కాళ్ల దగ్గర పడేసి విక్కీ కాళ్ళను టచ్ చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడు విక్కీ కోపంగా వెళ్ళిపోతుండగా ఇదంతా నువ్వు చేసావవి నాకు తెలుసు ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయకు అని ఆర్య మీద అరిచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

భర్త కష్టం చూసి బాధపడుతున్న పార్వతి

తర్వాత పద్మావతి రావడంతో ఏమయింది అమ్మి అనగా ఏమి కాలేదు అనవసరంగా మీరు టెన్షన్ పడకండి మేము బాగానే ఉన్నాం అక్క అని అంటుంది. తర్వాత భక్త ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ సంతోషపడుతుండగా ఇంతలో పార్వతి అక్కడికి రావడంతో అల్లుళ్లు కూతుళ్లు ఇంట్లో ఉన్నంతవరకు మనం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి నువ్వు కూడా ఏదైనా కావాలి అంటే నిర్మొహమాటంగా నువ్వు అడుగు నేను తెచ్చి ఇస్తాను అనడంతో సరే అని అంటుంది పార్వతి. పార్వతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని భక్త అడగగా మీరు లోపల అంత ఇబ్బంది పడుతూ కూడా ఏమి తెలియనట్టుగా నటిస్తున్నారు అనడంతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు భక్త.

మీరు బాధపడడం లేదు అని నా కళ్ళలోకి చూసి నిజం చెప్పండి అనడంతో ఇప్పుడు ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటాడు. నాకు తెలుసండి. మీరు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా నేను మీకు ఏం హెల్ప్ చేయలేకపోతున్నాను అని అనగా పిచ్చి పార్వతీ అలాంటివే మనసులో పెట్టుకోకు పిల్లల ముందు బాగా వుండు చాలు అని అంటాడు. అవన్నీ ఆలోచించకు పరిస్థితులు సర్దుకుంటాయి అని అంటాడు. అప్పుడు పార్వతీ తన చేతిలో గాజులు తీసి ఇవ్వగా వద్దు నీ దగ్గరే ఉంచు అని చెప్తాడు భక్త. తర్వాత పద్మావతి రావడంతో అల్లుడు గారికి ఏమైనా ఇబ్బంది ఏదో చెప్పమ్మా మా వాళ్ళ తనకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము అని అనడంతో లేదు నాయనా. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్న దాని కంటే ఎక్కువగా ఆయన అర్థం చేసుకున్నారు.

సంతోషంలో అను ఆర్య

ఆయన చాలా బాగా ఆలోచిస్తున్నారు అనడంతో సరే అమ్మ ఇప్పటికే లేట్ అయింది నువ్వు వెళ్లి పడుకో అని అంటుంది పార్వతి. ఆ తర్వాత అను ఆర్య బయటకు వెళ్ళగా కారులో డీజిల్ అయిపోవడంతో నేను కావాలని డీజిల్ కొట్టించలేదు పక్కనే ఇంత అందమైన అమ్మాయి ఉంటే నన్ను నేనే మరిచిపోతాను అంటూ రొమాంటిక్ గా మాట్లాడతాడు ఆర్య. ఆ తర్వాత కారు దిగి అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళుతుండగా సైకిల్ పై భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్లడం చూసి నాకు కూడా అలాగే వెళ్లాలని ఉందండి అని అంటుంది అను. అప్పుడు ఆమె కోరుకున్నట్టుగానే ఆర్య అను ని సైకిల్ పై పల్లెటూర్లు మొత్తం తిప్పుతూ పంట పొలాల్లో చూపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరు కలిసి పల్లెటూరు మొత్తం తిరుగుతూ ఉంటారు.

Nuvvu Nenu Prema November 25 Today Episode: విక్కీ మనసు మార్చే ప్రయత్నంలో పద్మావతి

ఇప్పుడు హ్యాపీనా అనడంతో చాలా హ్యాపీ అని అంటుంది అను. ఆ తర్వాత గదిలోకి వెళ్ళిన పద్మావతి విక్కీ పని చేసుకుంటుండగా ఎలా అయినా ఈ టెంపరోడు మూడు మార్చాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు పద్మావతి చీర కొంగు తగలడంతో కాస్త చూసుకోవచ్చు కదా అనడంతో నిన్ను చూసుకోవాలని నాకు ఉంది కానీ మీరే సారు నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు అని అంటుంది. ఇప్పుడైనా ఏమైంది మీరు ఓకే అంటే చాలు పాద సేవ నుంచి పవళింప సేవ వరకు అన్ని చేసి పెడతాను అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు. చూడు నాకు చాలా వర్క్ ఉంది నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్లి పడుకో అని అంటాడు విక్కీ.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 25, 2023 at 8:35 ఉద.