Nuvvu Nenu Prema November 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో విక్కీ నాకు వర్క్ ఉంది నన్ను విసిగించకు వెళ్లి పడుకో అనడంతో అప్పుడు పద్మావతి విసిగించద్ద ఇప్పుడు ఏం చేస్తానో చూడు అనుకుంటూ వెళ్లి మంచంపై పడుకో పోతుండగా ఏంటి ఇక్కడ పడుకుంటున్నావు అనడంతో మరి మీ ఒళ్ళో పడుకోమంటారా అని అంటుంది పద్మావతి. అలా కాదు నేను పైన పడుకుంటాను నువ్వు కింద పడుకో అని అంటాడు విక్కీ. ఎట్టెట్టా మీ ఇంట్లోనూ కింద పడుకొని ఇక్కడ కూడా ఇక్కడే కిందనే పడుకోవాలా అవన్నీ ఏం కుదరదు సారు. నేను పైనే పడుకుంటాను మీకు నచ్చితే పడుకోండి లేదంటే లేదు అని అంటుంది. అప్పుడు విక్కీ నీ పక్కన పడుకోను కావాలంటే వెళ్లి కారులో బయట పడుకుంటాను అనడంతో బాగానే ఉంది సారు కానీ పక్కన బయట మా అమ్మ నాన్న అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అంటుంది.

పద్మావతి ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్న విక్కీ

మీరు బయటికి వెళ్తే అనవసరంగా లేనిపోని అనుమానాలు రేకెత్తించిన వాళ్ళు అవుతారు అనడంతో విక్కి ఆలోచనలో పడతాడు. అప్పుడు విక్కీ బయటకు వెళ్లకుండా ఉండడం కోసం బయట ఎలుకలు ఉన్నాయి జాగ్రత్త అని భయపెట్టడంతో విక్కీ వెళ్లకుండా ఆగిపోతాడు. పద్మావతి మాటలకు భయపడిన విక్కీ బయటకు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు దోమలు కుట్టడంతో విక్కీ ఇబ్బంది పడుతుండగా డోర్ వేసి దోమలు కుడుతున్నప్పుడు డోర్ వేయాలని తెలియదా అని అంటాడు. ఇది బాగుంది సార్ ప్రతిదానికి నన్నే నిందిస్తే ఎలా అని అంటుంది పద్మావతి. అప్పుడు విక్కీ కోసం దోమలు బ్యాట్ తీసుకొని వచ్చి దోమలు కుట్టకుండా ఉండటం కోసం మంచం పైకి ఈ దోమల బ్యాటుతో దోమలు అన్ని చంపుతూ ఉంటుంది.

పద్మావతిపై కోప్పడుతున్న విక్కి

అప్పుడు నోరు మూసుకొని దోమల బ్యాటటు పక్కన పెట్టు అంటాడు విక్కీ. అప్పుడు విక్కీ మర్యాదగా కింద పడుకో అనగా ఏంటి ఏసి ఉన్నది లోపలే పడుకుందామనుకుంటున్నారా ఇప్పుడు గాని కరెంటు పోతే అనడంతో అప్పుడు కరెక్ట్ గా కరెంటు పోవడంతో కాసేపు కూడా మౌనంగా ఉండలేవా అని అంటాడు విక్కీ. అప్పుడు అందరి ఇళ్లలో కరెంటు ఉంది మన ఇంట్లో ఒకటే కరెంట్ లేదు అని పద్మావతి చెక్ చేయడానికి బయటకు వెళ్తుంది. అప్పుడు పద్మావతి వాళ్ళ నాన్న మనం ఏసీ బిగించేసరికి ఫీజు కాలిపోయింది అనడంతో విక్కీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు క్షమించండి అల్లుడుగారు అనడంతో పర్లేదు మామయ్య అని అంటాడు. అప్పుడు విక్కీ పడుకోవడం కోసం చల్లగా ఆరుబయట పడక వేయడానికి వెళుతుంది పద్మావతి.

మురళిపై అనుమాన పడుతున్న అరవింద

మరొకవైపు అరవింద బట్టలు సర్దుకుంటూ ఉండగా అప్పుడు సడన్ గా ఒక సబ్బు పడిపోవడంతో అది ఏంటి అని తెరిచి చూసి షాక్ అవుతుంది. ఈ డూప్లికేట్ కి కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు అని అనుకుంటూ ఉండగా ఇంతలో మురళి అక్కడికి వచ్చింది అరవింద చేతిలో ఉన్న సోప్ ని లాక్కొని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. అరవింద అనుమాన పడుతుండగా నువ్వేం ఆలోచించకు రానమ్మ అంటూ అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు మురళి. గతంలో జరిగిన విషయాలన్నీ తలచుకొని భర్త ప్రవర్తన పై అనుమాన పడుతూ ఉంటుంది అరవింద. ఆ తర్వాత మేడపైన విక్కీ పడుకోవడానికి పద్మావతి ఏర్పాట్లు చేస్తుంది. ప్రశాంతంగా పడుకోండి మీకు ఒక దోమ కూడా కొట్టకుండానే చూసుకుంటాను అని దోమల బ్యాట్ చేతిలో పట్టుకొని వాటితో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంది పద్మావతి.

Nuvvu Nenu Prema November 27 Today Episode: పద్మావతి చేసిన పనికి సంతోషపడుతున్న విక్కీ

అప్పుడు వాళ్లిద్దరూ మళ్ళీ ఫన్నిగా వాదించుకుంటూ ఉంటారు. విక్కీ పద్మావతి పై సీరియస్ అవుతూ అసలే కరెంట్ పోయింది అని ఇరిటేటింగ్ గా ఉన్నాను నువ్వు మళ్ళీ నన్ను విసిగించకు అని అంటాడు. అప్పుడు శ్రీనివాస ఏం చేయాలబ్బా కనీసం సమయానికి ఇంట్లో దోమ తెర కూడా లేదే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సరికొత్త ప్లాన్ వేస్తుంది పద్మావతి. విక్కీ కోసం అందంగా ఒక మంచం ని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు విక్కీ ఆ మంచాన్ని చూసి సంతోషపడుతూ బయటికి మాత్రం కోపంగా ఉన్నట్టు నటిస్తాడు. మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు అనడంతో అని నీ పక్కనే పడుకుంటాను సార్ అనడంతో ఏం మాట్లాడుతున్నావు అనగా మీ పక్కన ఒకవైపు తిరిగి పడుకుంటాను అని అంటుంది. సరే అని అంటాడు విక్కీ. అప్పుడు విక్కీ పద్మావతికి మధ్యలో ఒక దుప్పటి అడ్డుపెట్టి నువ్వు అటు పడుకో నేను ఇటు పడుకుంటాను అని అంటాడు విక్కీ. అప్పటి పద్మావతి చేసేదేమీ లేక విక్కీ చెప్పినట్టు వింటుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 27, 2023 at 8:33 ఉద.