Nuvvu Nenu Prema October 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉండగా అప్పుడు అనుకోకుండా పద్మావతి కాలికి గాజు పెంకు గుచ్చుకోవడంతో విక్కి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఇంట్లో అందరూ పద్మావతి గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. అప్పుడు విక్కీ పద్మావతిపై ఉన్న కోపాన్ని అంతా మరిచిపోయి తనకు దెబ్బ తగలడంతో తనపై ప్రేమ చూపిస్తూ ప్రేమగా కాలికి కట్టు కడతాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడగడంతో విక్కీ చూపిస్తున్న ప్రేమను చూసి పద్మావతి సంతోష పడుతూ ఉంటుంది. నా వల్ల జరిగింది అని అరవింద బాధపడుతూ ఉండగా మీరు అలా మాట్లాడకండి వదినా అని అరవిందకు నచ్చచెబుతుంది పద్మావతి.
విక్కీ చేసిన పనికి సంతోషపడిన పద్మావతి
అరవింద కన్నీళ్లు పెట్టుకోవడంతో నీ కంట్లో కన్నీరు ఎప్పుడు మేము చూడకూడదు ఎప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి అని అంటుంది పద్మావతి. అప్పుడు పద్మావతి గదిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతూ ఉండగా విక్కీ తనను ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని కుచల అనడంతో వాళ్ళిద్దర్నీ గదిలోకి పంపించి బయట లాక్ చేసి వాళ్ళ రూంలో కరెంటు తీసేయాలి అని అంటుంది అరవింద. అప్పుడు అరవింద ప్లాన్ కి మురళి లోపల కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తర్వాత అను ఆర్య ఇద్దరు లోపలికి వెళ్ళగా అక్కడున్న అట్మాస్ఫియర్ చూసి ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఒకరి జ్ఞాపకాల ఒకరు గుర్తుతెచ్చుకొని సంతోష పడుతూ ఉంటారు.
అనుని ఆటపట్టించిన ఆర్య
అప్పుడు అను భార్యని సరదాగా ఆట పట్టిస్తుంది. అప్పుడు వాళ్ళు ప్రేమగా ఒకరినొకరు హత్తుకుంటారు. ఆ తర్వాత పద్మావతిని లోపలికి తీసుకెళ్లి ఒక్కసారిగా మంచం మీద పడేస్తాడు. నీ మీద ఏదో ప్రేమతో ఇదంతా నేను చేయలేదు అని ఎప్పటిలాగే మాట్లాడడంతో పద్మావతి బాధపడుతూ ఉంటుంది. కానీ పద్మావతి మాత్రం విక్కీ మూడు మార్చడానికి ప్రయత్నిస్తూ నాకు దెబ్బ తగలగానే మీ కళ్ళల్లో భయం బాధ అని నాకు కనిపించాయి అని అంటుంది. మీలో ఉన్న ప్రేమను బయట పెట్టండి సారూ అనగా ఆపుతావా అని పద్మావతిపై సీరియస్ అవుతాడు విక్కీ. అప్పుడు బయటకు వెళ్లాలనుకున్న విక్కి బయట లాక్ చేయడంతో అందరూ నీ మాయలో పడిపోయారు అని పద్మావతి వైపు చూసి అంటాడు.
కుచలను చూసి భయపడిన నారాయణ
ఇప్పుడు కరెంటు కూడా లేదు ఏం చేద్దాం అనడంతో ఈ ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకుందాం అని అంటుంది పద్మావతి. ఇలాంటి ఏకాంత సమయాలు ఎన్ని వచ్చినా కూడా నువ్వు నా మనసుని మార్చలేవు అని అంటాడు విక్కీ. అప్పుడు విక్కీ మాటలకు లోలోపల బాధపడుతూ ఉంటుంది పద్మావతి. తరవాత అరవిందా వాళ్ళందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తినడానికి ఏమీ లేకపోవడంతో నానా తిప్పలు పడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న అన్నింటినీ వెతకగా పైన ఉన్న గోధుమపిండి కుచల మీద పడడంతో గట్టిగా అరవడంతో అక్కడికి నారాయణ వస్తాడు. కుచలభి చూసి భయపడి దయ్యం దయ్యం అంటూ బయటికి పరుగులు తీస్తాడు నారాయణ. తర్వాత అరవింద అక్కడికి వెళ్లి బాబాయ్ దెయ్యం కాదు పిన్ని అని అంటుంది.
Nuvvu Nenu Prema October 26 Today Episode: పద్మావతిని కాపాడిన విక్కీ
మరోవైపు పద్మావతి విక్టరీ ఇద్దరు ఫన్నీగా వాదించుకుంటూ ఉండగా విక్కీ కావాలనే పద్మావతిని అవాయిడ్ చేస్తూ సీరియస్ గా మాట్లాడుతాడు. నేను ఎన్ని మాయమాటలు చెప్పినా నేను నీకు లొంగను అని అంటాడు విక్కీ. అప్పుడు భోజనం సమయం అయ్యింది అని పద్మావతి గోల గోల చేయడంతో అక్కడే ఉన్న క్యాండిల్స్ అన్ని ఆర్పేస్తాడు. అగ్గి పెట్టి తీసుకొని మళ్ళీ విక్కీని ఆ క్యాండిల్స్ అన్ని వెలిగిస్తాడు. తరువాత పద్మావతి,విక్కీ ఇద్దరు ఒకరిపై ఒకరు పడతారు. అప్పుడు విక్కీ చేతిలో అగ్గిపుల్ల బెడ్ మీద పడడంతో బెడ్ అంటుకుంటుంది. అప్పుడు పద్మావతి వెళ్లి నీళ్లు తీసుకుని వచ్చి ఆ మంటలను ఆర్పేస్తుంది. తర్వాత విక్కి మళ్ళీ లాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు.