Nuvvu Nenu Prema October 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి ఆఫీస్ కి వెళ్ళగా అప్పుడు ఆర్య పద్మావతి నిన్ను బాగా అర్థం చేసుకుంటుంది చాలా ఓపిక ఉంది నీకోసం కష్టాలను కూడా భరిస్తుంది తను గ్రేట్ అంటూ పొగుడుతూ ఉంటాడు. అప్పుడు విక్కీ మనం ఇక్కడికి పద్మావతిని పొగడడానికి కాదు పని కోసం వచ్చాము అని అంటాడు. అప్పుడు పద్మావతి మీ విక్కీ సార్ కి గొంతు బాగోలేదు ఆయన మాట్లాడలేకపోతున్నారు అందుకే నేను ఆయన తరపున మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మీరందరూ ఆయనకు సహకరించండి అని చెప్పడంతో సరే అని స్టాఫ్ అందరు కలిసి పద్మావతి తో ఫోటోలు దిగుతారు. తర్వాత విక్కీ క్యాబిన్ లోకి వెళ్లి పని చేసుకుంటూ ఉండగా ఇంతలో కంపెనీ డీలు మాట్లాడడానికి వేరే వాళ్ళు ఫోన్ చేయడంతో విక్కీ ఫోన్ ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ బెల్ మోగించగా పద్మావతి అక్కడికి వస్తుంది.
విక్కీని ఆట పట్టిస్తున్న పద్మావతి
ఇంతలో పద్మావతి అక్కడికి వచ్చి ఆ ఫోన్ ఆన్సర్ చేయగా మేము విక్కీ గారితో మాట్లాడాలి అనుకుంటున్నాము ఒక కంపెనీకి సంబంధించిన విషయం ఆయనతో మాట్లాడాలి అనడంతో మొదట పద్మావతి తింగరి తింగరిగా మాట్లాడడంతో విక్కీ సీరియస్ అవుతాడు. సారీ ఏమనుకోకండి నేను ఆయన భార్యని మా ఆయనకు గొంతు బాగోలేదు అందుకే నేను మాట్లాడుతున్నాను అనడంతో సరే అని వాళ్ళు అసలు విషయం చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అప్పుడు ఫోన్ కట్ చేయగా విక్కీ ఏం కావాలంట ఏం జరిగింది అనడంతో అదేం లేదు సార్ వాళ్లు శుక్రవారం మహాలక్ష్మీ పూజ చేస్తున్నారంట మనిద్దరిని రమ్మని చెప్పారు అనడంతో ఏం కామెడీగా ఉందా అని అంటాడు విక్కి. సరే సార్ నేను మీకు వాళ్ళు చెప్పినది చెప్తాను కానీ నాకు లాభమేంటి, నీకు డబ్బింగ్ చెబుతున్నాను కదా నాకు ఏదైనా ఇవ్వండి అప్పుడే నేను మీకు వాళ్ళు చెప్పింది చెబుతాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ సరదాగా ఆటపట్టిస్తూ ఉంటుంది.
పద్మావతికి గిఫ్ట్ ఇస్తానన్న విక్కీ
నువ్వు ఏమైనా చేసుకో నేను ఇచ్చేది లేదు అంటూ విక్కీ కోపంతో మాట్లాడుతాడు. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా అంటూ ఆ బిజినెస్ దీని గురించి మాట్లాడడానికి ఫోన్ చేస్తుండగా వెంటనే పద్మావతి సారు మీరు మర్చిపోయారు మీరు మాట్లాడలేరు గొంతు కూడా బాగోలేదు అన్నంతో విక్కీ పద్మావతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకు సారు అంత కోపం నేనేమైనా బహుమతులు అడిగానా చిన్న కోరిక కదా అనగా సరే ఏంటో చెప్పు అని అంటాడు విక్కీ. అప్పుడు పద్మావతి సంతోషంగా సరే అని బిజినెస్ డీల్ గురించి చెప్పడంతో ఆ బిజినెస్ డీల్ ఓకే చేయమని చెబుతాడు విక్కి. తర్వాత పీఏ వచ్చి మీతో మాట్లాడడానికి వేరే కంపెనీ వాళ్ళు వస్తున్నారు.
అరవింద ముందు దొంగ కన్నీరు కార్చిన మురళి
మీటింగ్ ఎక్కడ అరెంజ్ చేయాలి అప్పుడు పద్మావతి కాస్త ఓవర్ గా మాట్లాడుతుంది. అప్పుడు ఎండి సీట్లో కూర్చోడానికి వెళ్లగా విక్కీ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు అరవింద మురళి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మురళి ఎలా అయినా అనుమానాన్ని పోగొట్టాలి అనుకుని అరవింద దగ్గరికి వెళ్లి లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ పుట్టబోయే బిడ్డ కుంకుమపువ్వు అంటూ అబద్ధాలు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇన్ని మాట్లాడినా నువ్వు నన్ను ఇంకా అనుమానిస్తూనే ఉన్నావా అంటూ సెంటిమెంట్ తో అరవింద ఆలోచనలను మార్చాలి అని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు అరవింద ముందు దొంగ కన్నీరు కారుస్తూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు మురళి. ఈ అవమానాలు తట్టుకోలేను లగేజ్ సర్దుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు అరవింద ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా కావాలని లగేజ్ సర్దుకున్నట్లు నాటకాలు ఆడుతూ ఉంటాడు.
Nuvvu Nenu Prema October 30 Today Episode: అరవిందను మోసం చేస్తున్న మురళి
చివరికి అరవిందను హత్తుకొని నా ప్రేమ సక్సెస్ అయ్యింది అని నవ్వుకుంటూ ఉంటాడు. మరొకవైపు ఆఫీసులో అందరూ మీటింగ్ కి వచ్చే వాళ్లకోసం ఎదురు చూస్తూ ఉంటారు. పద్మావతి ఎలా అయినా విక్కీ మనసు గెలవాలి అని టెన్షన్ పడుతూ మనసులో దేవుడిని కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళు వచ్చి ఆఫీస్ మొత్తం గమనించి మళ్లీ వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత అందరూ కలిసి మీటింగ్ హాల్ కి వెళ్తారు. అప్పుడు విక్కీ వాళ్ళకు సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు పద్మావతి వాళ్లతో కాస్త తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉండగా విక్కీ లోలోపల కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు విక్కీ గొంతు ఎలా పోయింది అన్నది విడమర్చి చెబుతూ ఉంటుంది పద్మావతి. అప్పుడు వాళ్ళు బిజినెస్ ల గురించి చెప్పగా పద్మావతి ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ వుంటుంది.