Ori Devuda: అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ఓరి దేవుడా. ఈ సినిమాలో నటుడు విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా తమిళం లో విజయవంతమైన ” ఓ మై కడవులే ” సినిమాకు రీమేక్ గా ” ఓరి దేవుడా ” గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కుటుంబం మొత్తం కలిసి చూసేలా దర్శకుడు తెరకెక్కించాడు.
ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా పై ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాల కృష్ణ విశ్లేషించారు. ఆయన మాట్లాడుతూ.. సినిమాకు ఇలాంటి టైటిల్ పెట్టడం అంటే సాహసం అని ఆయన చెప్పాడు.
అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థం అయ్యేలా స్క్రీన్ ప్లే చెయ్యడం అంటే కష్టమని అలాగే అందులో ఏమైనా తప్పులు ఉంటే కనెక్టివిటీ కోల్పోతారు అని ఆయన చెప్పాడు. అయితే ఈ చిత్రం లో అలాంటి తప్పులు వచ్చయేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా అని ఆయన తెలిపాడు.
అలాగే ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర విచిత్రంగా ఉందని ఆయన చెప్పాడు. ఆయన దేవుడా? లేక దేవుడి ప్రతినిధా? అని చెప్పడంలో స్పష్టత లేదని ఆయన అన్నారు. అలాగే వెంకటేష్ అతిథి పాత్ర వేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన కోసం వచ్చిన ప్రేక్షకులు సినిమా చూసి నిరాశకు గురయ్యారని ఆయన చెప్పాడు.
అంత పెద్ద ఇమేజ్ ఉన్న హీరో నీ తన స్థాయి కంటే తక్కువ చూపిస్తే ప్రమాదం అని ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాలో అలాంటి పాత్రకు, కామెడీ చేయాలంటే రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎంతో మంది హీరోలు ఉన్నారని.. ఇలాంటి పాత్రల్లో వాళ్లను పెడితేనే బాగుంటుందని ఆయన తెలిపాడు. ఇక హీరోయిన్ నటన గాను ఆయన ప్రశంసించారు.
Ori Devuda వెంకటేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రచయిత గోపాల కృష్ణ..
ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమా ఇది ఆకాశం అంచుల దాకా చేరాలి కానీ మధ్యలోనే ఆగిపోయింది ఏమో అని ఆయన అన్నారు. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సక్సెస్ అయిందో లేదో తెలియదు అని ఆయన చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ మంచి ప్రయత్నమే అని చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు. ఈ విధంగా ఆయన వెంకటేష్ ఈ సినిమాలో ఆ పాత్ర చేయకుండా రాజేంద్రప్రసాద్ ఆ పాత్రను చేసి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.