Oscar Awards: సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల పురస్కారాలను అందిస్తూ సెలబ్రిటీలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులు ఉన్నప్పటికీ ఆస్కార్ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా విలువైనదిగా భావిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఇలాంటి ఒక గొప్ప అవార్డును అందుకోవాలని ప్రతి ఒక్క నటీనటులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు.ఇక తాజాగా జరిగిన 95వ అంతర్జాతీయ ఆస్కార్ వేడుకలలో భాగంగా తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించుకొని ఆస్కార్ అవార్డు గెలుచుకొని తిరిగి స్వదేశానికి వచ్చారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గర్విస్తుంది. ఇకపోతే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ హ్యాండిల్స్ లో కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలను ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్రమంలోని ఇండియాకు చెందినటువంటి కేవలం ఇద్దరే ఇద్దరు హీరోలను ఆస్కార్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో ఫాలో అవుతూ ఉన్నారు. మరి ఆస్కార్ ఇంస్టాగ్రామ్ హ్యాండిల్స్ లో ఫాలో అవుతున్న ఆ ఇద్దరు ఇండియన్ సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే….
Oscar Awards: ఆ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోలు వీళ్లే…
తెలుగు చిత్ర పరిశ్రమలు నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ను ఆస్కార్ తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో ఫాలో అవుతున్నారు. ఇక మరొక హీరో ఎవరు అనే విషయానికొస్తే బాలీవుడ్ బాద్షా, షారుక్ ఖాన్ నుసైతం ఆస్కార్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో కావడం విశేషం ఇలా ఇండియాకు చెందిన ఇద్దరి హీరోలను మాత్రమే ఆస్కార్ ఫాలో అవుతుందని తెలియడంతో వీరి అభిమానులు రియల్ గ్లోబల్ స్టార్స్ అంటూ పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు.