OTT: కరోనా ఈ సమయంలో థియేటర్లన్నీ మూతపడటంతో ప్రేక్షకులను సందడి చేయడానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓటీటీల ద్వారా వివిధ రకాల సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేశాయి. ఇక కరోనా తగ్గిపోయి యధావిధిగా థియేటర్లు తెరచుకున్న ఓటీటీలకు వచ్చిన ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. వారం వారం సరి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ నెల 25వ తేదీ ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో డ్రామా జోనర్ లో తెరకెక్కిన టూల్‌సిడాస్ జూనియర్ అనే హిందీ మూవీ విడుదల కానుంది. అదే విధంగా ఈ నెల 25వ తేదీ యూట్యూబ్ లో ది మినియేచరిస్ట్ ఆఫ్ జునాగఢ్ అనే మూవీ విడుదల కానుంది. ఇక ప్రముఖ
ఓటీటీ సమస్థ ఆహా వేదికగా ఈ నెల 27వ తేదీ విశ్వక్ సేన్,రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి ఆహాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ రొమాంటిక్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా సొంతం చేసుకోగా ఈనెల 27వ తేదీ నుంచి ఈ సినిమా ఆహా లో ప్రసారం కానుంది.

OTT: పే ఫర్ వ్యూ పద్ధతిలో…
జాన్ అబ్రహాం, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అటాక్. ఈ సినిమా ఈ నెల 27వ తేదీ జీ 5 ద్వారా ప్రసారం కానుంది. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాతు వాక్కుల రెండు కాదల్. ఈ సినిమా ఈ నెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కానుంది. అయితే ఈ సినిమాను పే ఫర్ వ్యూ పద్ధతిలో రూ.199 చెల్లించి ఈ సినిమాని చూడాల్సి ఉంటుంది. ఈ వారం ఈ సినిమాలన్ని ఓటీటీలో విడుదల అయి ప్రేక్షకులను సందడి చేయనున్నాయి.