Ott Release Movies: సంక్రాంతి పండుగ అంటేనే థియేటర్ల వద్ద సినిమాల జాతర జరుగుతుందని చెప్పాలి. ఇలా ఎన్నో సినిమాలో విడుదలవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలకు మంచి ఆదరణ రావడంతో ఓటీటీలో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు వెబ్ సిరీస్లో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మరి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లో ఏవి అనే విషయానికి వస్తే…
సన్ నెక్స్ట్: విశాల్ హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లాఠీ. ఈ సినిమా థియేటర్లో పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీ సన్ నెక్స్ట్ లో తెలుగు తమిళ భాషలలో విడుదలకు సిద్ధమైంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోస్: అజయ్ దేవగన్, శ్రీయ, టబూకీలక పాత్రలలో నటించిన దృశ్యం సినిమా ఎలాంటి విజయమందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి (జనవరి 13) నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
హంటర్స్ అనే వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లో నేటి నుంచి ప్రసారం కానుంది.
జీ 5:
హెడ్ బుష్ చిత్రం జనవరి 13 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
తట్ట స్సెరి కూట్టం జనవరి 13 నుంచి అందుబాటులోకి రానుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ జనవరి 13న విడుదల కానుంది.
Ott Release Movies:
నెట్ ఫ్లిక్స్:
వైకింగ్స్: వల్హల్లా వెబ్ సిరీస్ జనవరి 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి లో అందుబాటులోకి వచ్చింది.
బ్రేక్ పాయింట్ వెబ్ సిరీస్ జనవరి 13 నుంచి అందుబాటులోకి రానుంది.
డాగ్ గాన్ హాలీవుడ్ వెబ్ సిరీస్ జనవరి 13 నుంచి అందుబాటులోకి వస్తుంది.
ఇలా ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.