Puri Jagannath: రాంగోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన వద్ద అసిస్టెంట్ గా పని చేసి అనంతరం బద్రి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన హీరోలందరికీ కూడా ఈయన సూపర్ హిట్ సినిమాలను అందించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నటువంటి డబల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇలా దర్శకుడిగా తన కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి పూరీ జగన్నాథ్ ఎన్నో ఫ్లాప్ సినిమాలను కూడా చవిచూసి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయినప్పటికీ దర్శకుడిగా ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటూ తిరిగి ఇండస్ట్రీలో నిలబడుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూరి జగన్నాథ్ తన కెరీర్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. చాలామంది ఇండస్ట్రీలోకి రావాలన్న కలలు కంటూ ఉంటారు అయితే వారికి సరైన సపోర్ట్ లేక టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారని ఈయన తెలిపారు.
నా టాలెంట్ ను అడ్డుకోలేదు…
చాలామంది సినిమాలలోకి రావాలన్న కోరికలు ఉన్నప్పటికీ వారికి వారి తల్లిదండ్రుల మద్దతు లేకపోవడంతో ఇతర రంగాలలో స్థిరపడుతున్నారు. అయితే చిన్నప్పుడు నాకు కూడా ఇండస్ట్రీలోకి రావాలని కోరిక చాలా ఉండేది అయితే పెద్దయిన తర్వాత ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులకు చెప్పాను దాంతో వారు నన్ను అడ్డుకోలేదు 20 వేలు రూపాయలు నా చేతిలో పెట్టి ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇలా నా టాలెంట్ కు నా తల్లిదండ్రులు అడ్డుకోకపోవటం వల్లే నేను ఇండస్ట్రీలో కొనసాగానని నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం తన తల్లిదండ్రులే అంటూ ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.