Paruchuri Gopala krishna: తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో వందలాది సినిమాలకు కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. సినీ రంగంలో తమకంటూ చెరగని ముద్ర ఏర్పరుచుకున్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ అన్నదమ్ముల వార్తల్లో బాగా హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తుంది. ఆ మధ్య ఆయన ఆరోగ్యం గురించి రక రకాలుగా పుకార్లు జరిగాయి. మొత్తానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరుచూరి ఫోటో తో అతని ఆరోగ్యం పై నానా రకాల అనుమానాలు బయటపడుతున్నాయి.
ఇక ఈ అనుమానాలకి పరుచూరి గోపాలకృష్ణ స్పందించాడు. అన్నయ్య కు బాగానే ఉందని, తనకు ఏమీ కాలేదని.. మీరేమీ ఆందోళన చెందవద్దని పరుచూరి గోపాలకృష్ణ స్పందించాడు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా పరుచూరి సోషల్ మీడియాలో కనిపించడం లేదు. దీంతో కొందరిలో కొత్త అనుమానాలు, పుకార్లు పెరుగుతున్నాయి.
వాటన్నిటికీ పరుచూరి ఒక కొత్త వీడియో ద్వారా బ్రేక్ ఇచ్చాడు. తను ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ తనకు జరిగిన ఆపరేషన్ గురించి బయట పెట్టాడు. గత కొన్ని రోజులుగా మీముందుకు రాకపోవడానికి కారణం నాకు కంటి కి ఆపరేషన్ జరిగిందని తెలిపాడు. ప్రస్తుతం పరిస్థితి అదే విధంగా ఉందని తెలిపాడు.
Paruchuri Gopala krishna: పరుచూరి గోపాలకృష్ణ కు జరిగిన ఆపరేషన్ ఇదే!
అంతేకాకుండా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పినట్లు తెలిపాడు. ఇక కొన్ని రోజుల షూటింగ్ లకు, సినిమాలకు దూరంగా ఉండమని చెప్పినట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇక కొన్ని రోజుల వరకు కళ్ళద్దాలు వాడుతూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాను అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఇక ఏదో ఒక కంటెంట్ తో యూట్యూబ్ ప్రియుల ముందుకు వచ్చే పరుచూరి గోపాలకృష్ణ తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ ప్రేక్షకులను ఏ విధంగా మందలిస్తాడో చూడాలి.