Pavitra Lokesh: పవిత్ర లోకేష్ …ప్రస్తుతం ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించిన పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. సీనియర్ నటుడు నరేష్ తో ఉన్న రిలేషన్ వల్ల పవిత్ర లోకేష్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా భవిష్యత్తులో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ కీలకపాత్రలలో నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా విడుదలయ్యింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ ఫలితాలు లభిస్తున్నాయి.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నరేష్ పవిత్ర లోకేష్ చేసిన రచ్చ అంతా కాదు. ప్రమోషన్స్ కోసం టీవీ షోలో ఇంటర్వ్యూలలో పాల్గొన్న వీరిద్దరూ హద్దులు దాటి చిందులు వేయటం ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడంతో వీరిద్దరూ హాట్ టాపిక్ గా మారారు. ఇలా గత కొంతకాలంగా తరచు వీరి రిలేషన్ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో గతంలో పవిత్ర లోకేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ తనకు కాబోయే భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pavitra Lokesh: ఆ ఇద్దరు హీరోలు నా క్రష్…
ఈ వీడియోలో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ…” గీతాంజలి సినిమాలో నాగార్జున నటన నాకు చాలా ఇష్టం. నాగార్జున నటన చూసి అలాంటివాడు నాకు భర్తగా రావాలని ఫీలింగ్ ఏర్పడింది. నాగార్జున నా ఫస్ట్ క్రష్ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అంటే కూడా తనకు ఇష్టం అని తెలిపింది. అయితే ఆ ఇద్దరు ఇష్టమని చెప్పటంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పక్కన నరేశ్ ని పెట్టుకొని మనసులో ఆ ఇద్దరినీ పెట్టుకుంటే నరేష్ పరిస్థితి ఏమిటి అంటూ నెటిజన్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.