Pavitra Lokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ ఏకంగా నటుడు నరేష్ తో కలిసి రిలేషన్ లో ఉంటున్న విషయం మనకు తెలిసిందే. నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు రిలేషన్ లో ఉండడం జరిగింది.ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా నరేష్ పవిత్ర లోకేష్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్న తరుణంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వార్తల్లోకి ఎంట్రీ అవుతూ తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ ఎలా పెళ్లి చేసుకుంటారంటూ ఈమె పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే నరేష్ పవిత్ర మాత్రం ఇప్పటికే రిలేషన్ లో ఉంటూనే ఇద్దరు కలిసి సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈనెల 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.’
Pavitra Lokesh: పార్ట్నర్ మాత్రమే కాదు…
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవిత్ర లోకేష్ నరేష్ తో తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. నరేష్ సినిమాలపరంగా తనకు పార్టనర్ మాత్రమే కాదని పెద్ద సపోర్టివ్ సిస్టం అంటూ కూడా ఈమె కామెంట్ చేశారు. ప్రతి విషయంలోనూ నాకు ఆయన ఎంతో అండగా నిలుస్తున్నారని పవిత్ర వెల్లడించారు.ముఖ్యంగా నా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న సమయంలో నరేష్ తనకు ఎంతో అండగా నిలిచారని ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.