Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా వీరిద్దరి టాపిక్ వైరల్ గా మారింది. నరేష్ , పవిత్ర లోకేష్ కీలక పాత్రలలో నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. నరేష్ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమా నరేష్ కి కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.
సినిమాని ప్రమోట్ చేయడానికి నరేష్ పవిత్ర లోకేష్ ఎంతో కష్టపడ్డారు. ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు. టీవీ షోలో కూడా వీరిద్దరూ పాల్గొని సినిమాని ప్రమోట్ చేశారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరు కూడా రెచ్చిపోయి డాన్స్ చేయటం ముద్దులు పెట్టుకోవడంతో వీరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గతంలో సినిమా ప్రమోషన్స్ కోసం ఒక టీవీ షోలో పాల్గొన్న నరేష్ ని సినిమాలో లిప్ లాక్ సీన్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. సినిమాలో లిప్ లాక్ సీన్ కోసం తాను పడిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.
Lokesh: బాగా ఇబ్బంది పెట్టింది…
ఈ క్రమంలో నరేష్ మాట్లాడుతూ..” డైరెక్టర్ వచ్చి లిప్ లాక్ సీన్ గురించి చెప్పగానే పవిత్ర షాక్ అయింది. ముద్దు కోసం మూడు నాలుగు గంటల పాటు నన్ను ఉప్పతిప్పలు పెట్టింది. మూడు నాలుగు గంటల పాటు బతిమాలకు ఉన్న తర్వాత లిప్ లాక్ సీన్ కి అంగీకరించి ముద్దు పెట్టింది” అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నేటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.