Pavithra Lokesh: సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు ఇండస్ట్రీలో ఏదైనా వ్యక్తిగత అవమానాలు ఎదురవుతే వారి కెరీర్ కే ఎదురుదెబ్బ తగులుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నటీనటులు ఇండస్ట్రీలో అవమానాలు ఎదుర్కొని సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన పవిత్ర పరిస్థితి కూడా అలాగే ఉంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పవిత్ర లోకేష్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కానీ గత కొంతకాలం నుండి ఈమె గురించి ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది. ఈమె ప్రముఖ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తుంది అని ఈ మధ్య వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది. ఇక వీరిద్దరూ ఓ హోటల్లో ఉండగా.. అక్కడికి నరేష్ ఇప్పుడే భార్య వచ్చి బాగా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా చర్చగా మారడంతో.. ప్రతి ఒక్కరు వీరి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ వయసులో వీరికి ఇదేం పోయేకాలం అంటూ నానా రకాలుగా కామెంట్లు కూడా పెడుతున్నారు. పైగా సినీ ప్రముఖులు కూడా వీరిని తమ మాటలతో దూషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం పవిత్ర కెరీర్ మూత పడినట్లు తెలుస్తుంది.

Pavithra Lokesh: ఇకపై పవిత్ర సినిమాలలో కనిపించదు అని ఈ విధంగా టాక్ వినిపిస్తుంది..
ఇప్పటికీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలతో బాగా బిజీగా ఉంటున్న పవిత్ర కు ఇటువంటి ఇష్యు ఎదురు కావటంతో ఇకపై తనకు సినిమాలలో అవకాశాలు రావని టాక్ నడుస్తుంది. ఈ ఇష్యులో ఆమె చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారడంతో నెటిజన్లు బాగా ఏకీపారిస్తున్నారు. దీంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావని.. పైగా తనను ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.