Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన పవన్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక తన ప్రత్యేకమైన మేనరిజంతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. పవన్ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులలో ఎనలేని క్రేజ్ తన సొంతం చేసుకున్నాడు. ఇక పవన్ ఎదుగుదలకు తగ్గట్టుగానే ఆయన జాలిగుణం కూడా ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. తన ముందుకు సాయం చేయమని వచ్చిన వారిని వట్టిచేతులతో పంపించడు.
కొన్ని కొన్ని సార్లు పవన్ స్వయంగా కొందరి సమస్యలను తెలుసుకొని వాళ్లకు తనకు తోచిన విధంగా డబ్బు రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. పవన్ గొప్పతనం గురించి త్రివిక్రమ్ చాలాసార్లు చెప్పడం మనం వింటూ ఉంటాము. ఇక చాలా మంది సెలబ్రిటీలలో పవన్ కళ్యాణ్ దానగుణం, సేవా గుణం గురించి మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ నటుడు సమ్మెట గాంధీ కూడా పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని బయటపెట్టాడు.

Pawan Kalyan: ఆ జూనియర్ ఆర్టిస్ట్ కి పవన్ కళ్యాణ్ చేసిన సహాయం ఇదే!
అత్తారింటికి దారేది సినిమా సూటింగ్ సమయం లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ తన కూతురి పెళ్లి అని పవన్ కి శుభలేఖ ఇచ్చాడట. ఇక పవన్ కళ్యాణ్ ఆ ఆర్టిస్ట్ ను సాయంత్రం కలవమని అన్నాడు. ఇక సాయంత్రం వెళ్లే సమయంలో ఆ జూనియర్ ఆర్టిస్ట్ కలవగానే.. పవన్ కళ్యాణ్ తన పీఏ ని పిలిచి లక్ష రూపాయలు పెళ్లి కానుక ఇచ్చినట్లు సమ్మెట గాంధీ తెలియజేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి సమ్మెట గాంధీ చెప్పిన మాటలు పవన్ అభిమానులను ఒక్కసారిగా కదిలించేసాయి. మరి మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్కెయ్యండి.