Pawan Kalyan- Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లామ్ ఆహా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే పేరుతో టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్‌స్టాఫబుల్ సీజన్-2 కొనసాగుతోంది. అన్‌స్టాపబుల్ సీజన్-1 సక్సెస్ అవ్వగా.. సీజన్-2 అంతకుమించి హీట్ అవుతోంది. ఒక్కొక్క ఏపిసోడ్ అంచనాలకు మించి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రతీ ఎసిసోడో అత్యధిక వ్యూస్ సంపాదించుకుంటోంది.
తాజాగా ఈ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి షూటింగ్ ఇవాళ మధ్యాహ్నం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ షోలో బాలయ్య, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారాయి. అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్, బాలయ్య మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకున్నట్లు షోకు ఆడియెన్స్‌గా హాజరైన వాళ్లు చెబుతున్నారు.
పవన్ జీవితంలో వివాదాస్పద అంశాలు, రాజకీయాలు, సినిమాపై గురించి క్వశ్చన్ వేసినట్లు చెబుతున్నారు. పవన్ జీవితంలో వివాదాస్పదమైన మూడు పెళ్లిళ్ల అంశం గురించి కూడా పవన్ కల్యాణ్‌ను బాలయ్య క్వశ్చన్స్ అడిగినట్లు చెబుతున్నారు. ఈ షోలో మూడు పెళ్లిళ్ల ప్రస్తావన బాలయ్య తీసుకురాగా.. పవన్ కల్యాణ్ తన ప్రత్యర్థులకు చెంపచెల్లుమనేలా సమాధానమిచ్చారు. తానేమీ కావాలని చేసుకోలేదని, అభిప్రాయాలు కలవకపోవడంతో ఇష్టపూర్వకంగా విడిపోయినట్లు చెప్పారు. విడాకులు ఇచ్చిన తర్వాతనే తాను వేరే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.
Pawan Kalyan- Balakrishna:
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన బాలయ్య కూడా దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒకరి పర్సనల్ విషయాల గురించి పబ్లిసిటీ చేయడం మానుకోవాలని, ఎదుటివారు ఎంతలా బాధపడతారో తెలుసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వారి కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలని బాలయ్య సూచించారట. దీంతో ఆడియెన్స్ జై బాలయ్య అంటూ నినాదాలు చేశారట.