Pawan Kalyan – Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలతో సైతం పోటీగా దూసుకెళ్తున్న బాలయ్య ఎనర్జీ చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. ప్రస్తుతం ఆయన ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి. ఒకవైపు రాజకీయ నాయకుడిగా, మరో వైపు నటుడుగా బాధ్యతలు చేపడుతూ బిజీ లైఫ్ ను గడుపుతున్నాడు బాలయ్య.
అంతేకాకుండా అన్ స్టాపబుల్ రియాలిటీ షోలో కూడా వ్యాఖ్యతగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో సీజన్ వన్ పూర్తి కాగా ప్రస్తుతం సీజన్ 2 కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అయితే ఈసారి కూడా స్టార్ హీరోలను తీసుకొచ్చి బాగా సందడి చేస్తున్నాడు బాలయ్య. ఇటీవలే ప్రభాస్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఆ ప్రోమో ఎంతలా వ్యూస్ సొంతం చేసుకుందో చూసాం. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న ప్రసారం కానుంది.
అయితే వచ్చే ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు. పవన్ కూడా హీరోగా కాకుండా రాజకీయాల్లో కూడా ముందున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఎంతలా గుర్తింపు ఉందో, ఎంతలా అభిమానం ఉందో చూసాం.
Pawan Kalyan – Balakrishna: పవన్ ప్రోమో కోసం ఎదురుచూస్తున్న అభిమానులు..
అయితే పవన్ కళ్యాణ్ మరో స్టార్ హీరో బాలయ్య తో ముచ్చట్లు పెట్టనున్నాడని తెలియడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషంలో మునుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రోమో త్వరగా విడుదల చేయండి అంటూ కోరుకుంటున్నారు. పైగా బాలయ్య ఈ షోలో ఎంతలా సందడి చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. అటువంటిది పవన్ కళ్యాణ్ తో ఇంకెంత సందడి చేస్తాడో అనేది ఆత్రుతగా మారింది.