Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి ధరంతేజ్ కలిసిన నటిస్తున్నటువంటి చిత్రం బ్రో. ఈ సినిమా జులై 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నో విషయాల గురించి తెలిపారు.
ఇకపోతే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి కూడా ఈ సందర్భంగా ఈయన ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఇకపోతే సాయి ధరంతేజ్ తనకు మెడలో వేసుకోవడానికి ఒక చైన్ అడిగారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు ఇలా సాయి ధరంతేజ్ తనకోసం చైన్ అడగడంతో ప్రత్యేకంగా తనకు నీతా లుల్లాతో స్పెషల్ గా చైన్ డిజైన్ చేయించి మరి తీసుకువచ్చాను అంటూ ఈ సందర్భంగా తన మేనల్లుడికి వేదికపైనే తాను తెచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.
Pawan Kalyan: ప్రత్యేకంగా డిజైన్ చేయించిన పవన్..
ఇలా సాయి ధరమ్ తేజ్ కు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా పండగ చేసుకో అంటూ సరదాగా పవన్ తెలిపారు. ఇలా తన మామయ్య తన కోసం చైన్ తీసుకురావడంతో సాయి తేజ్ ఎంతో సంబరపడ్డారు ఇలా తనకు కానుకగా చేయిస్తున్న సమయంలో ఫాన్స్ ఒక్కసారిగా కేకలు వేస్తూ సందడి చేశారు. ఇక మామ అల్లుళ్ళ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది