Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ట్వీట్ కు అర్థం నిహారిక గురించేనా.. అసలు ఏం జరుగుంతుంది?

Akashavani

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల ప్రజలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జానీ సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆపై కొన్ని సినిమాలలో నటించి తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. పవన్ సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా మరో లెవెల్లో దూసుకువెళుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే తాజాగా శనివారం బంజారాహిల్స్ లో ఒక పబ్ లో పోలీసుల దాడి చేసిన సంగతి మనకు తెలుసు. ఇక ఆ పబ్ లో నిహారిక కూడా ఉండటం సినీ ఇండస్ట్రీ మొత్తం స్టన్ అయ్యే విధంగా చేసింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ట్వీట్ కు అర్థం నిహారిక గురించేనా.. అసలు ఏం జరుగుంతుంది?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ట్వీట్ కు అర్థం నిహారిక గురించేనా.. అసలు ఏం జరుగుంతుంది?

Pawan Kalyan: తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇదే!

కాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయం స్పందించినప్పటికీ మెగా అభిమానులు మాత్రం ఆ విషయంలో కొంత నెగిటివ్ గానే ఉన్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఇలా పంచుకున్నారు. శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగే అంత మూర్ఖత్వం మనది.. అవతల వాడు మనల్ని వాడుకోవడమే మన విజయమని భ్రమ పడే అంతా అమాయకత్వం కూడా మనదే.. అని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ప్రస్తుతం పవన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా బయట పడ్డ డ్రగ్స్ వ్యవహారం పైనే పవన్ ఈ ట్వీట్ చేసాడని సోషల్ మీడియా ప్రియులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదైనా నిహారిక ఆ కేసులో పోలీసులకు పట్టుపడడం కొంత కొణిదెల ఫ్యామిలీ మొత్తానికి మైనస్ అని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయానికి కూడా కొంత ఇది మాయని మచ్చలా ఉన్నదని చెప్పవచ్చు.

- Advertisement -