Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు రాజకీయాలతో మరోవైపు వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నాడు. ఇక ఈయనకు ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. ఈయనకే కాకుండా ఈయన కొడుకు అకీరా నందన్ కు కూడా మంచి అభిమానం ఉంది.
నిజానికి పవన్ కళ్యాణ్ తరువాతే అకీరానందన్ అని చెప్పాలి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ తో కాకుండా అకీరానందన్ తో మాత్రం రిలేషన్ ఉందని తాజాగా ఓ నటుడు తెలిపాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు అడవి శేష్. ప్రస్తుతం ఈయన మేజర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా బృందం ప్రమోషన్స్ భాగంలో బాగా బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్పెషల్ స్క్రీనింగ్ కూడా చేశారు. నిన్న వైజాగ్ లో కూడా స్పెషల్ షో వేశారు. ఇక అక్కడ అడవి శేష్ ఓ మీడియాతో ముచ్చటించగా కొన్ని విషయాలు పంచుకున్నాడు.
ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా స్పెషల్ షోను వేస్తున్నారా అని ప్రశ్న ఎదురుకావడంతో.. ఆయనను సంప్రదించామని.. స్పెషల్ షో వేస్తామని అడిగామని.. కానీ ఆయన పొలిటికల్ బిజీగా ఉన్నాడని.. కాబట్టి ఆయన ఎప్పుడూ అడిగితే అప్పుడే షో వేస్తామని అన్నాడు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని.. బాగా ఆరాధిస్తుంటాను అని అన్నాడు.

Pawan Kalyan: అకీరా నందన్ తనకు మంచి స్నేహితుడట..
అకీరా నందన్ కూడా తనకు మంచి స్నేహితుడు అని.. గత పదేళ్ళలో పవన్ కళ్యాణ్ గారితో రెండుమూడు సార్లు మాత్రమే మాట్లాడి ఉంటాను అని.. కానీ అకీరా తో మాత్రం బాగా క్లోజ్ గా ఉంటాను అని చెప్పకనే చెప్పాడు. ఇద్దరు కలిసి బాస్కెట్ బాల్ కూడా ఆడుతుంటారు అని గతంలో రేణుదేశాయ్ కూడా తెలిపింది.