Pawan Kalyan: నాకు అలాంటి ఆలోచనే లేదు.. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య!

Akashavani

Pawan Kalyan: రేణు దేశాయ్.. ఈ పేరు టాలీవుడ్ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జేమ్స్ పండు చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది.

ఇక ఆ తర్వాత జానీ సినిమాలో నటించి తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకుంది రేణు. అలా కొంతకాలం వీరిరువురి వివాహబంధాన్ని బాగానే కొనసాగించారు. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ వీరు దాంపత్య జీవితానికి బ్రేకప్ చెప్పుకున్నారు.

అప్పట్లో ఈ వార్తను సినీ ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత ఎవరికి వారు వేరు వేరు జీవితాలను గడుపుతూ ముందుకు వస్తున్నారు. ఇక రేణు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో ఒక మంచి రోల్ చేస్తుంది. ఇక ఉగాది సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ ఈవెంట్ లో రేణు దేశాయ్ కూడా పాల్గొంది.

Pawan Kalyan: నాకు అలాంటి ఆలోచనే లేదు.. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య!
Pawan Kalyan: నాకు అలాంటి ఆలోచనే లేదు.. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య!

Pawan Kalyan: ఇలా అని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చేసింది..!

ఇక ఈ ఈవెంట్ లో రేణు దేశాయ్ ఒక విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అదేమిటంటే.. నటన పరంగా ఆమె కీలక పాత్రలో చేయడం సిద్ధమేనని చెప్పింది. పాత్ర మంచిగా అనిపిస్తే రేణు దేశాయ్ నటించడానికి ఒప్పుకుంటారట. అందుకోసం ఒక మంచి మంచి ఉదాహరణ టైగర్ నాగేశ్వరరావు సినిమానే.. ఇక చాలా కాలం తర్వాత సినీ తెరపై అడుగుపెట్టిన రేణు తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా అనిపిస్తుంది చూడాలి.

- Advertisement -