Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా వేడుకలో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం సాయి ధరంతేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే కోమాలోకి వెళ్లినటువంటి ఈయన క్షేమంగా తిరిగి బయటపడ్డారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సాయి తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో తాను త్రివిక్రమ్ ఇంట్లో ఉన్నానని పవన్ తెలిపారు.
ఈ ప్రమాదం జరగగానే నాకు ఫోన్ వచ్చింది అయితే అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్ కి బయలుదేరాను.బైక్ ప్రమాదం అంటే చిన్నగా తగిలి ఉంటుంది ఒక గంటలో బయటకు వస్తాడు అనుకున్నాను అక్కడికి వెళ్తే పెద్దపెద్ద డాక్టర్స్ అంత లోపలికి వెళ్తున్నారు తనుకు సీరియస్ అని చెప్పారు. ఆ సమయంలో తాను ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోయానని పవన్ తెలిపారు. ఆ సమయంలో తాను ఒక మూల కూర్చొని నా ఇష్ట దేవతను ప్రార్థించానని తెలిపారు.
Pawan Kalyan: నాలో నేనే కుమిలిపోయాను…
వాడిని ఎలాగైనా బ్రతికించు వాడికి చాలా జీవితం ఉందని ఇష్ట దైవాన్ని ప్రార్థించి మనసులోనే కుమిలిపోతూ ఏడ్చానని పవన్ తెలిపారు. భగవంతుడి దయవల్ల డాక్టర్ల కృషి వల్ల సాయితేజ్ ఎలాంటి ప్రమాదం లేకుండా బయట పడ్డారని పవన్ తెలిపారు. అందుకు ముందుగా డాక్టర్లకు కృతజ్ఞతలు తెలపాలని ఈయన వెల్లడించారు. అంతకంటే ముందుగా ప్రమాదం జరిగి రోడ్డుపైని సహాయ స్థితిలో ఉన్నటువంటి తేజ్ ను కాపాడిన అబ్దుల్ కితాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా పవన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.