Pawan Kalyan: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలలో రాణించటమే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా చురుకుగా ఉంటున్నాడు. ఇటు సినిమాలు అటు రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఎలక్షన్స్ జరుగుతుండటంతో సినిమాలను తొందరగా పూర్తి చేసి ప్రచార పనులకు పూర్తి సమయం కేటాయించనున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది . ఇటీవల పవన్ కళ్యాణ్ తాబేలు ఉంగరం కనిపించడంతో అందరూ దాని గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. సాధారణంగా కొంతమంది పండితుల సూచనల మేరకు తాబేలు ఉంగరం ధరిస్తారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి తాబేలు ఉంగరం కనిపించడంతో పవన్ కళ్యాణ్ కి కూడా జ్యోతిష్య శాస్త్రం పట్ల నమ్మకం ఉందని అందరూ భావిస్తున్నారు. జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలిగిపోయి అధికారం సాధించడానికి పవన్ కళ్యాణ్ ఇలా జ్యోతిష శాస్త్ర ప్రకారం పరిహారాలు చేయటానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
Pawan Kalyan: రాజకీయ ఎదుగుదల కోసమేనా…
ఈ క్రమంలో పండితుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ బంగారంతో తయారుచేసిన తాబేలు ఉంగారాన్ని ధరించినట్టు తెలుస్తోంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం తాబేలు ఉంగరంకి చాలా విశిష్టత ఉంది. తాబేలుని మహావిష్ణువుకి ప్రతిరూపంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారు ఈ ఉంగారాన్ని ధరించటానికి లేదు. కొన్ని రాశుల వారే ధరించాలి. ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా మాత్రమే కాకుండా తాను ఎంచుకున్న రాజకీయ రంగంలో విజయం సాధించటానికే నిపుణుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ ఈ తాబేలు ఉంగరం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.