Pawan Kalyan: ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియని వారంటూ ఉండరు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మాత్రం సినిమా సినిమా కు పెరగడం ఒక్క పవన్ విషయం లోనే జరిగింది అని చెప్పడంలో సందేహం లేదు.
పవన్ కళ్యాణ్ కు ఉన్నంత క్రేజ్ తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో కు లేదు. ఇతనికి ఉన్న క్రేజ్ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ హీరో గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ 14 మార్చి 2014న జన సేన పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. అయితే 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల్లో పోటీ చేసింది.
కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. గాజువాక అలాగే భీమవరంలో అతను YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో రెండింటిలోనూ ఓడిపోయాడు. ఇక అతని పార్టీ రజోల్ లో మాత్రమే ఆయనకు సీట్ గెలుపొందింది. ఇది ఎన్నికలలో గెలిచిన ఏకైక సీటుగా నిలిచింది.
ఇక ఆ తర్వాత నుంచి కూడా పవన్ సీఎం అవ్వాలని పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో విధాలుగా ప్రచారాలు చేపట్టుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్నో విమర్శలు చేస్తున్నాడు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జనసేన పార్టీ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం జరుగుతూనే ఉంది.
ఈ క్రమం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పవన్ కళ్యాణ్..పవన్ కళ్యాణ్ పై జగన్ మోహన్ రెడ్డి ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గతం లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. అందులో రెండవ భార్య అయిన రేణు దేశాయ్ ను మొదటి భార్య వుండగానే ప్రేమించి సహ జీవనం చేసి ఒక మగ బిడ్డను కూడా కన్నారు.
Pawan Kalyan: పవన్ కు అల్టిమేట్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ఆర్ అభిమాని..
దీంతో మొదటి భార్య విడాకులు ఇవ్వగా అనంతరం రేణు దేశాయ్ ను బిడ్డ పుట్టాక పెళ్లి చేసుకున్నాడు పవన్. దీన్ని ఉద్దేశిస్తూ వైఎస్ఆర్ అభిమాని 2004 లో అకీరా.. పుట్టాడు. అయితే మొదటి భార్య కు విడాకులు ఇచ్చింది 2008 లో ఆయన ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అంటూ పవన్ పై ఫైర్ అయ్యాడు.