Pawan Kalyan: ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరుకు ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్లు ఎక్కువగా లేకపోయినా కూడా ఆయనని అభిమానించే వారి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన అభిమానులు ఏం చేయటానికి అయినా సరే సిద్ధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ని ఒక దేవుడిలా ఆరాధిస్తూ ఆయన కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఇలా అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఒక దేవుడిలా ఆరాధిస్తుంటే మరి కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఎంత చెప్పినా కూడా ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్న మాట వాస్తవమే. సాధారణంగా సెలబ్రిటీలు రెండవసారి పెళ్లి చేసుకోవాలంటేనే పరువు పోతుందని ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకుని తనని తాను సమర్ధించుకుంటూ ఉంటాడు. అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఇప్పటికీ.. ఎప్పటికీ.. హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనతో కలిసి పని చేసిన ఒక హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan: కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పవన్…
ఆ హీరోయిన్ మరెవరో కాదు పార్వతి మెల్టన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా విడుదలై సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆమెకు రూ.24 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు అప్పట్లో ఓ పేపర్లో కథనం వచ్చింది. పవన్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకోవడానికి పార్వతి సింపుల్‌గా నో చెప్పేసిందట. కానీ తనని ఓ ఫ్రెండ్‌లా భావించి ఈ నెక్లెస్ తీసుకోమని పవన్ ఆమెతో అన్నాడట. అంతే కాకుండా వీరిద్దరూ ఒక హోటల్ లో 2 గంటల పాటు కూర్చొని కలిసి భోజనం చేసినట్టు ఆ కథనంలో ప్రచురించారు. అప్పట్లో ఈ విషయం సంచలనం రేపింది. ఇక తాజాగా మరొకసారి ఆ పేపర్ కటింగ్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.