Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల కోసం ఈయన భారీ స్థాయిలో పోటీకి దిగబోతున్నారు.ఇలా రాజకీయాలలోనూ సినిమాలలోను ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్న విషయం గురించి నటి లయ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లయ ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా ఇండస్ట్రీలో సుమారు 13 సంవత్సరాల పాటు ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లయ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు రావడంతో పలు విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే యాంకర్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె ఆసక్తికరమైన సమాధానాలను వెల్లడించారు.
Pawan Kalyan: ఆ కుర్చీకే కళ వస్తుంది…
ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ…తనకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ గారిలో ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని అయితే ఆయన ముఖ్యమంత్రి అవుతారు లేదు అనే విషయం జనాలే డిసైడ్ చేస్తారని తెలిపారు. ఇక ఆయన కనక ముఖ్యమంత్రి అయితే ఆ కుర్చీకే ఒక కళ వస్తుందని, ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ఎప్పుడు టాప్ పొజిషన్లోనే అందరికీ ఆదర్శంగా ఉంటారంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.