Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతోనే మరొకవైపు రాజకీయ పనులతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి యాత్ర కూడా ప్రారంభించాడు. 2024 లో జరగబోయే ఎలక్షన్స్ లో ఎలాగైనా తన పార్టీని గెలిపించి అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో వారాహి యాత్ర ప్రారంభించి ప్రతిపక్ష నాయకుల గురించి విమర్శలు చేయడమే కాకుండా సినిమా హీరోల గురించి కూడా పొగుడుతూ వారి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

 

ఈ క్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇటీవల ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. తాజాగా భీమవరంలో వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను ఏరోజు ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు, కేవలం జనసేన అని పెట్టాను.ఎందుకంటే నన్ను అభిమానించే, అభిమానించని యువత అందరూ కూడా నాకు కావాలి. మీరు ఆంధ్రప్రదేశ్ యువత అందరి అభిమానుల కోసం నేను ఉన్నాను అని చెప్పుకొచ్చాడు.

Pawan Kalyanప్రభాస్ ఫ్యాన్స్ కు క్షమాపణలు...

అలాగే ఇక్కడ ప్రభాస్ గారి అభిమానులు ఎక్కువ, వారందరి అభివృద్ది కోసం జనసేన పని చేస్తుంది. ఇక గతంలో ఒకసారి ప్రభాస్ గారి అభిమానులకు నా అభిమానులకు చిన్న పోస్టర్ విషయంలో గొడవ జరిగింది. అయితే ఒక పోస్టర్ చినిగితే అంత గొడవ చేయకూడదు, క్షమించి వదిలివేయాలి, చిన్న గొడవను పెద్దది చేయవద్దు అని చేతులెత్తి వేడుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో అభిమానుల మద్య జరిగిన గొడవకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులందరికీ క్షమాపణలు తెలిచేసాడు. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on జూలై 1, 2023 at 12:25 సా.