Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ‘ బ్రో ‘ . జులై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ తమిళ సినిమా వినోదయం సీత కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు,టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు రెట్టింపు చేశాయి.
తాజాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారన్న విషయం గురించి దర్శకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..” ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, ఆయన వెంటనే షూటింగ్ ఎప్పుడు అని అడిగారు. అలా ఆయనను కలిసిన మూడు రోజులకే BRO షూటింగ్ స్టార్ట్ చేశాం. అయితే పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగుపెట్టగానే మొదట అక్కడ ఏం జరుగుతుందో మొత్తం గమనిస్తారు అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.
Pawan Kalyan: ఉపవాసం తో షూటింగ్ చేసిన పవన్..
‘ అంతె కాకుండా తక్కువ సమయంలో సినిమా షూటింగ్ పూర్తి చేయటానికి పవన్ కళ్యాణ్ ఎంతో సహకరించాడు. సమయం వృధా చేయకూడదని సెట్ లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఆయన దేవుడి కేరెక్టర్ లో నటించటం వల్ల సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన ఎంతో నిష్టగా ఉపవాసం చేసి పనిచేశారు.. ‘ పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” సినిమా కోసం మా హీరో ఏం చేయటానికైన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు..అంటూ పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.