Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను కమిటైన సంగతి తెలిసిందే. కానీ, ఆయన అటు రాజకీయాలలోనూ బిజీ అవుతుండటంతో సినిమాల విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఇప్పటికే పవన్ నుంచి నాలుగు సినిమాలు రావాల్సింది. కానీ, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మాత్రమే వచ్చాయి. ఇక పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదంటున్నారు. ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఈ ఏడాదే వస్తుందని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇక దర్శకుడు హరీష్ శంకర్ సినిమా భవదీయుడు భగత్‌సింగ్ పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్ కూడా గత ఏడాది సెట్స్ పైకి రావాల్సి ఉంది. కానీ, అలా అలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఆ మధ్య అంటే సుందరానికి సినిమా ఫంక్షన్‌లో ఈ మూవీ ఉంటుందని పవన్ నుంచి క్లారిటీ ఇప్పించారు దర్శకనిర్మాతలు. అయితే, తాజా సమాచారం ఇప్పట్లో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్‌ల భవదీయుడు భగత్‌సింగ్ మూవీ సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదట. అందుకే, పవన్ కావాలని మైత్రీ మూవీస్ వారితో రామ్మ్ పోతినేని, హరీష్ శంకర్‌ల ప్రాజెక్ట్ ను సెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.
Pawan Kalyan: సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా..!
పవన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సమయం రాజకీయాల కోసమే కేటాయించనున్నారు దాంతో భవదీయుడు ఆలస్యం అవుతున్న కారణంగా ఆ ప్లేస్‌లో మేకర్స్‌కి ఈ ప్రాజెక్ట్ సెట్ చేశారట. ఇక తమిళ మూవీ వినోదాయా చిత్తం కూడా మొదలవుతుందని చెప్పుకుంటున్నారు. అధికారికంగా ఇప్పటికే మూవీ ఓపెనింగ్ కూడా అయిందని ప్రచారం జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని సమాచారం. మరి చూడాలి ఈ ప్రాజెక్ట్ పరిస్థితేంటో. ఇదే కాదు, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా పవన్ సినిమాలు చేయాల్సి ఉంది.